సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Hari Hara Veera Mallu: దర్శకుడు జ్యోతికృష్ణ ఎమోషనల్ పోస్ట్

ABN, Publish Date - Jul 10 , 2025 | 12:23 PM

దర్శకుడు క్రిష్‌ వదిలి వెళ్ళిన హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ ను జ్యోతికృష్ణ తండ్రి కోరిక మేరకు టేకప్ చేసి పూర్తి చేశాడు. గురువారం జ్యోతి కృష్ణ ఎక్స్ వేదిక గా పెట్టిన పోస్ట్ అతనికి పవన్ కళ్యాణ్‌ పై ఉన్న ప్రేమను ఆవిష్కరించేదిగా ఉంది.

ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం (AM Rathnam) పెద్దకుమారుడు జ్యోతికృష్ణ (Jyothi Krishna). తండ్రి అడుగుజాడల్లో సినిమా రంగంలోకి వచ్చినా... నిర్మాతగా మారకుండా దర్శకుడయ్యాడు. తెలుగుతో పాటు పలు తమిళ చిత్రాలనూ డైరెక్ట్ చేశాడు జ్యోతికృష్ణ. అయితే జయాపజయాలు అతనితో దోబూచులాడాయి. తాజాగా క్రిష్‌ (Krish) వదిలి వెళ్ళిన 'హరిహర వీరమల్లు' (Harihara Veeramallu) ప్రాజెక్ట్ ను జ్యోతికృష్ణ తండ్రి కోరిక మేరకు టేకప్ చేసి పూర్తి చేశాడు. గురువారం జ్యోతి కృష్ణ ఎక్స్ వేదిక గా పెట్టిన పోస్ట్ అతనికి పవన్ కళ్యాణ్‌ పై ఉన్న ప్రేమను ఆవిష్కరించేదిగా ఉంది.


ఎ.ఎం. రత్నం సమర్పణలో ఆయన సోదరుడు దయాకరరావు నిర్మించిన 'హరిహర వీరమల్లు' సినిమా ఈ నెల 24న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. దానికి సంబంధించిన పనుల్లో గత కొన్ని రోజులుగా జ్యోతికృష్ణ బృందం బిజీబిజీగా ఉంది. అటువంటి సమయంలో జ్యోతికృష్ణ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. అందులో జ్యోతికృష్ణ తన భార్య, తండ్రితో పాటు ఉన్నారు. వీరందరూ కలిసి, డిప్యూటీ సీఎం, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో కలిసి కొద్దిరోజుల క్రితం ఫోటో దిగారు. జ్యోతికృష్ణ కుమార్తెను పవన్ కళ్యాణ్‌ ఎత్తుకుని ఉన్నారు. ఈ ఫోటోను గురువారం జ్యోతికృష్ణ పోస్ట్ చేస్తూ, 'నా హృదయానికి ఎప్పటికీ దగ్గరగా ఉండే ఫోటో ఇది. కేవలం వృత్తిపరమైన జ్ఞాపకం మాత్రమే కాదు... ఇది జీవితకాలం గుర్తుంచుకునేది' అని పేర్కొన్నారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ, 'ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పక్కన 'హరిహర వీరమల్లు' దర్శకుడిగా నిల్చోవడం అనేది ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. సినిమా గొప్పతనాన్ని, దాని పట్ల చూపించాల్సిన నిబద్ధతను తెలిపి, నాలో స్ఫూర్తి నింపిన వ్యక్తి ఆయన. ఈ ఫోటోలో నేను, నా కుటుంబం ఉన్నాం. పవన్ కళ్యాణ్‌ గారి చేతుల్లో నా కుమార్తె అహానా ఉంది. ఇవాళ తన మొదటి పుట్టిన రోజు. సహజంగా కొన్ని ఫోటోలు కథలుగా మారతాయి. కానీ ఇది నాకు వరం లాంటింది' అని పేర్కొన్నారు.

Also Read: Atlee: మరోసారి పుష్పరాజ్ సరసన...

Also Read: Harihara Veeramallu: ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నంతో స్పెషల్ చిట్ చాట్

Updated Date - Jul 10 , 2025 | 12:23 PM