సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Malluwood: వాహన అక్రమ రవాణా కేసుల్లో హీరోలు...

ABN, Publish Date - Oct 08 , 2025 | 11:40 AM

వాహనాల అక్రమ రవాణ కేసులో ఈడీ అధికారులు మలయాళ స్టార్ హీరోలు మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్ళు, ఆఫీసులపై దాడులు జరిపారు. తప్పుడు పత్రాలతో వాహనాల క్రయ విక్రయాలు జరిపిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

Malluwood Stars

కొంతకాలంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వాహనాల అక్రమ రవాణ కేసును తీవ్రంగా తీసుకుంది. భూటాన్ నుండి మనదేశంలోకి ప్రీ ఓన్డ్ లగ్జరీ వాహనాలను అనధికారంగా విదేశీ మారక లావాదేవీలతో కొనుగోలు చేస్తున్నారని ఈడీ దృష్టికి వచ్చింది. దాంతో ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫేమా) కూడా ఇందులో ఇన్ వాల్వ్ అయ్యింది.


గత నెల సెప్టెంబర్ 23న కొచ్చిలోని కస్టమ్స్ (ప్రివెంటివ్) కమిషనరేట్ రాష్ట్ర వ్యాప్తంగా 30 ప్రదేశాలలో ఒకేసారి దాడులు చేసింది. పలువురు సినీ ప్రముఖుల ఇళ్ళను కూడా శోధించింది. ఆ సమయంలో భూటాన్ నుండి అ్రకమంగా రవాణా చేసుకున్న 37 సెకండ్ హ్యాండ్ కార్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 'ఇండో-భూటాన్, నేపాల్ మార్గాల గుండా ల్యాండ్ క్యూజర్, డిఫెండర్ వంటి లగ్జరీ కార్లను అక్రమంగా దిగుమతి చేసుకుని, రిజిస్ట్రేషన్ చేస్తున్న సిండికేట్ ఆధారాలను ఆ సమయంలో లభ్యమయ్యాయని ఈడీ అధికారులు తెలిపారు. వారి ప్రాధమిక విచారణంలో కోయంబత్తూరు కేంద్రగా పనిచేస్తున్న సిండికేట్ 'భారత సైన్యం, అమెరికా రాయబార కార్యాలయం, విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్లతో నకిలీ పత్రాలు సృష్టించి ఈ దందా నడుపుతోందని తేలింది. అలానే అరుణా చల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో మోసపూరితంగా ఆర్.టి.ఓ. రిజిస్ట్రేషన్ చేసి, ఆ కార్లను తక్కువ ధరకు ప్రముఖ వ్యక్తులకు, సినిమా హీరోలకు విక్రయిస్తున్నట్టు తెలిసింది. రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్ మంత్రిత్వ శాఖ జరిపిన దర్యాప్తులో దాదాపు 150 నుండి 200 వాహనాలు ఇలా అక్రమ రవాణ జరిగినట్టు తేలింది. ఈ వాహనాలను కోయంబత్తూరు కు చెందిన సిండికేట్ కేరళకు స్మగ్లింగ్ చేసినట్టు అనుమానం వ్యక్తమైంది.


ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్ లోని 3,4,8 సెక్షన్లను వీరు ఉల్లంఘించినట్టు ఆధారాలు లభించడంతో ఈడీ అధికారులు చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగా మలయాళ స్టార్ హీరోలు మమ్ముట్టి, పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్ కు చెందిన కేరళ, తమిళనాడు నివాసాల్లో 17 ప్రాంతాలలో బుధవారం ఉదయం సోదాలు నిర్వహించారు. వీరితో పాటుగా వాహన యజమానులు, ఆటోమొబైల్ వర్క్ షాప్స్, వ్యాపారా కేంద్రాలపైనా ఈడీ దాడులు చేసింది. త్రిశూన్, కోజికోడ్, మలప్పురం, కొట్టాయం, కోయంబత్తూరులో ఈ దాడులు జరిగాయి.

Also Read: Bigg Boss Kannada: అనుమ‌తులు లేకుండా బిగ్ బాస్ షో.. తాళం వేసిన అధికారులు

Also Read: Shruti Haasan: విజయ్‌.. ఓ జోకర్‌! ఆయన్ని.. తప్పుపట్టొద్దు

Updated Date - Oct 08 , 2025 | 11:40 AM