Shruti Haasan: విజయ్.. ఓ జోకర్! ఆయన్ని.. తప్పుపట్టొద్దు
ABN , Publish Date - Oct 08 , 2025 | 07:39 AM
తమిళ హీరో, ‘తమిళగ వెట్రి కళగం’ అధ్యక్షుడు విజయ్ (TVK Vijay) ను హీరోయిన్ శృతిహాసన్ ఓ జోకర్‌తో పోల్చారు.
తమిళ హీరో, ‘తమిళగ వెట్రి కళగం’ అధ్యక్షుడు విజయ్ (TVK Vijay) ను హీరోయిన్ శృతిహాసన్ (Shruti Haasan) ఓ జోకర్‌తో పోల్చారు. ఇటీవల జరిగిన కరూర్ తొక్కిసలాట వల్ల 41 మంది మరణించిన ఘటనను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘ఓ జోకర్ సర్కస్‌కు వెళ్లడం వల్లే ఆ ఘోరం జరిగింది’ అంటూ ఆమె తన ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు.
విజయ్ ఒక జోకర్.. జోకర్‌గానే ఆయన నడుచుకున్నారని, అందువల్ల ఆయన్ని తప్పుపట్టరాదన్నారు. సర్కస్‌కు పోయిన వారినే వేలెత్తి చూపాలన్నారు. అయితే ఈ పోస్టు చేసిన కాసేపటికి దానిని తొలగించినప్పటికీ అప్పటికే అది కాస్త సామాజిక మాధ్యమాల్లోకి ఎక్కి హాల్ చల్ చేసింది.
ఇదిలా ఉండగా కరూర్ దుర్ఘటన (Karur stampede)లో మృతి చెందిన కొంతమంది కుటుంబీకులతో విజయ్ సోమవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జరిగిన నష్టం పూడ్చలేనిదని, కానీ జీవితాంతం తాను అండగా ఉంటానని విజయ్ వారిని ఓదార్చారు. అయితే విజయ్ (Thalapathy Vijay), శృతి హసన్ జంటగా గతంలో పులి అనే సినిమాలో కలిసి నటించడం విశేషం.