Biggboss 9: ఎండింగ్‌కు.. బిగ్ బాస్ సీజన్ 9! ఇమ్మాన్యుయేల్‌కు ఎదురుగాలి
ABN , Publish Date - Dec 01 , 2025 | 01:20 PM
బిగ్ బాస్ సీజన్ 9 దాదాపు ముగింపుకొచ్చేసింది. దాంతో విజేత ఎవరు కావచ్చుననే దానిపై రకరకాల చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ఇమ్మాన్యుయేల్ గ్రాఫ్ ఇప్పుడు అమాంతంగా కిందకు పడిపోయిందని తెలుస్తోంది.
బిగ్ బాస్ (Biggboss) సీజన్ 9కు మరో మూడు వారాల్లో శుభం కార్డు పడబోతోంది. దాంతో ఈసారి విజేతగా ఎవరు నిలుస్తారనే విషయంలో ఉత్కంఠత నెలకొంది. నిన్న మొన్నటి వరకూ ఈ సీజన్ విజేత హాస్యనటుడు ఇమ్మాన్యుయేల్ అనే అందరూ గట్టిగా అనుకున్నారు. హౌస్ లో ఉన్న ఇమ్మాన్యుయేల్ సైతం ఇదే భావంతో కాస్తంత ఓవర్ కాన్ఫిడెన్స్ గా బిహేవ్ చేస్తూ వస్తున్నాడు. ఇమ్మాన్యుయేల్ తర్వాతే తనూజ నిలుస్తుందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా సమీకరణాలు మారిపోయాయి. ఊహించని విధంగా ఇమ్మాన్యుయేల్ మూడో స్థానంలోకి వచ్చేశాడని, అతని పైన తనూజ ఉందని, ఆ పైన కళ్యాణ్ పడాల ఉన్నాడని చెప్పుకుంటున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు.
టాప్ 5 లో ఉంటాడని అనుకున్న కళ్యాణ్ టాప్ త్రీలో ఉండటం... టాప్ వన్ లో నిలుస్తాడని అనుకున్న ఇమ్మాన్యుయేల్ మూడో స్థానానికి వెళ్ళిపోవడం చూస్తుంటే... ఈ మూడు వారాల్లో ఏదైనా జరగొచ్చనే భావన వ్యక్తం అవుతోంది. అసలు ఏ ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా కామనర్ గా వచ్చిన ఆర్మీ మ్యాన్ కళ్యాణ్ కెప్టెన్ గా గెలవడంతో బిగ్ హౌస్ లో నంబర్స్ మారిపోయాయని అంటున్నారు.
అతని సిన్సియారిటీకి వ్యూవర్స్ ఫిదా అయ్యారని, దానికి తోడు అతని పి.ఆర్. టీమ్ సైతం ప్రమోషన్స్ భారీ స్థాయిలో చేస్తున్నారని సమాచారం. ఇమ్మాన్యుయేల్ మూడు సార్లు ఈ సీజన్ లో కెప్టెన్ కావడం అతనికి కలిసి వచ్చే అంశమే అయినా... గత వారం కెప్టెన్సీ కోసం డీమాన్ పవన్ తో వాదనకు దిగడాన్ని చాలామంది హర్షించలేదు. ఆ రకంగా బిగ్ బాస్ కంటెస్ట్స్ గ్రాఫ్స్ అటూ ఇటూ అయిపోయాయి. సో... ఇప్పుడు ఇమ్మాన్యుయేల్ విజేతగా నిలుస్తాడా? అని అడిగితే... అవును అని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది.
Also Read: Bollywood: సంక్రాంతికి వస్తున్నాం.. అంటున్న అక్షయ్ కుమార్
Also Read: Venkatesh: విక్టరీ ఫ్యాన్స్ కు పండగే పండగ...