Venkatesh: విక్టరీ ఫ్యాన్స్ కు పండగే పండగ...
ABN , Publish Date - Dec 01 , 2025 | 12:38 PM
నెల రోజుల వ్యవధిలో వెంకటేశ్ నటించిన నాలుగు సినిమాలో థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. అందులో మూడు రీ-రిలీజ్ మూవీస్ కాగా ఒకటి చిరంజీవితో వెంకటేశ్ కలిసి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా.
విక్టరీ వెంకటేశ్ (Venkatesh) ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. హడావుడిగా వంద సినిమాలు పూర్తి చేయడం కంటే.. సెలక్టివ్ గా మూవీస్ చేసి సక్సెస్ కొట్టాలని అనుకుంటున్నాడు. 'ఎఫ్ 3' (F 3) తర్వాత ఆ స్థాయి విజయాన్ని కూడా 'ఓరి దేవుడా', 'సైంథవ్' సినిమాలు ఇవ్వలేకపోయాయి. అయితే ఆ లోటును తీర్చుతూ ఈ యేడాది సంక్రాంతికి వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam) మూవీ తీర్చేసింది. ఏకంగా మూడు వందల కోట్ల రూపాయల గ్రాస్ ను ఇది వసూలు చేసింది. అయితే ఈ యేడాది ప్రారంభమే కాదు.... ముగింపులోనూ తన సత్తా చాట బోతున్నాడు వెంకటేశ్.
డిసెంబర్ 13 వెంకటేశ్ బర్త్ డే ఆ సందర్భంగా అతని సూపర్ హిట్ సినిమాలు రెండు విడుదల కాబోతున్నాయి. అందులో ఒకటి ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వెంకటేశ్, సౌందర్య జంటగా నటించిన 'పెళ్ళి చేసుకుందాం' కాగా మరొకటి జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో వెంకటేశ్, ప్రీతి జింతా జంటగా నటించిన 'ప్రేమంటే ఇదేరా'. ఈ రెండు సినిమాల్లో మొదటిది ఫ్యామిలీ ఆడియెన్స్ ను అలరిస్తే... రెండోది యూత్ ను బాగా అట్రాక్ట్ చేసింది. ఇక ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను, అటు యూత్ ను కూడా ఓ ఊపు ఊపేసిన వెంకటేశ్ మరో సినిమా 'నువ్వు నాకు నచ్చావ్'. ఈ సినిమా జనవరి 1న నూతన సంవత్సర కానుకగా రీ-రిలీజ్ కాబోతోంది.
విశేషం ఏమంటే... ఈ మూడు రీ-రిలీజెస్ తో పాటు వెంకటేశ్ నటించిన మరో క్రేజీ ప్రాజెక్ట్ 'మన శంకర వరప్రసాద్ గారు' సంక్రాంతి కానుకగా జనం ముందు నిలువబోతోంది. చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో వెంకీ ఓ ప్రత్యేక పాత్రను పోషించాడు. సో... ఆ రకంగా నెల రోజుల వ్యవథిలో వెంకటేశ్ సినిమాలు మూడు రీ-రిలీజ్ అవుతుంటే మరో సినిమా డైరెక్ట్ గా రాబోతోదన్నమాట.
Also Read: Euphoria: గుణశేఖర్ 'యుఫోరియా' విడుదల వాయిదా
Also Read: Tuesday TV Movies: మంగళవారం, Dec 2.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే