Malayalam Bigg Boss Season 7: బుల్లితెరపై బిగ్ బాస్ సందడి

ABN , Publish Date - Jul 21 , 2025 | 06:12 PM

ఆల్ ఇండియా బుల్లితెర ప్రేక్షకుల్ని అందించే షో అది. భాషలు వేరైనా నడిపించే విధానం మాత్రం ఒకటే. అలాంటి షో ఇప్పుడు కొత్త సీజన్ తో ప్రధాన భాషల్లో వచ్చేందుకు రెడీ అవుతోంది... మరి ఆ డీటెయిల్స్ ఓ సారి చదివేద్దాం.

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss) మళ్లీ వచ్చేస్తోంది. తెలుగు (Telugu), హిందీ (Hindi), మలయాళం (Malayalam)లో జరిగే కొట్లాటను వీక్షించేందుకు ఆడియెన్స్ సిద్ధమవుతున్నారు. అది త్వరలో ప్రసారం కానున్న బిగ్ బాస్.... టన్నుల కొద్ది ఎంటర్ టైన్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన ప్రోమోస్ ఆ యా షోస్ పై అంచనాలను పెంచేస్తున్నాయి. ఎప్పటిలాగే... ఈ షోలకు హోస్ట్ గా వ్యవహరించిన వారే మళ్లీ కంటెస్టెంట్స్ తాటా తీసేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా మలయాళం బిగ్ బాస్ షో ప్రోమో కూడా అంచనాలను పెంచేసింది.


'బిగ్ బాస్ మలయాళం సీజన్ 7' కోసం జనం ఎంత ఎగ్జైట్ అయిపోతున్నారో... అంతే ఎగ్జైటింగ్ గా మేకర్స్ ప్రోగ్రామ్ ని అనౌన్స్ చేశారు. కోలీవుడ్ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) హోస్ట్ చేస్తున్న ఈ సీజన్ 7.... ఆగస్ట్ 3వ తేదీ సాయంత్రం 7 గంటలకు ఆసియా నెట్‌లో స్టార్ట్ అవబోతోంది. జియో హాట్ స్టార్ లో ఇరవై నాలుగు గంటలూ ఈ షో స్ట్రీమింగ్ కానుంది. ప్రోమో వీడియోలో డేట్ సడన్‌గా రివీల్ చేసి బుల్లితెర ఫ్యాన్స్ లో సంతోషాన్ని నింపారు నిర్వాహకులు.

మలయాళ బిగ్ బాస్ షో ప్రోమో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. ఈ సీజన్ బాగా స్ట్రిక్ట్‌గా, సీరియస్‌గా ఉంటుందని ప్రోమో చూస్తే అర్థమవుతోంది. 'ఏంజెల్ లా యాక్ట్ చేయొద్దు.. సేఫ్ గేమ్ ఆడొద్దు... ఎంటర్‌టైన్ చేయడానికి వచ్చారంతే... గొడవలు చేయొద్దు' అని మోహన్ లాల్ కూడా క్లియర్ గా చెప్పారు. అంటే ఈసారి ఎమోషనల్ డ్రామా లేదా విక్టిమ్ కార్డ్స్ ఇందులో పనిచేయవన్నమాట.

మరోవైపు తెలుగులో బిగ్ బాస్ సీజన్ 9 కూడా రెడీ అవుతోంది. కంటెస్టెంట్ల ఎంపికలో నిర్వాహకులు బిజీగా ఉన్నారని తెలుస్తోంది. అయితే డేట్ ఇంకా కన్ఫామ్ కాలేదు కానీ తెలుగు సంబంధించిన అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) హోస్ట్ గా ఓ టీజర్ వచ్చింది. ఇక హిందీలోనూ బిగ్ బాస్ 19 ప్లాన్స్ జోరుగా జరుగుతున్నాయి. సల్మాన్ ఖాన్ (Salman Khan) షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా... కో-యాంకర్ గా ఫరాఖాన్ సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈసారి బిగ్ బాస్ షోలు ప్రధాన భాషల్లో అన్ని ఒకేసారి కొనసాగేలా కనిపిస్తున్నాయి.

Read Also: Peddi - Ram Charan:  పెద్ది కోసం రామ్ చరణ్ ఫిట్‌నెస్‌ మిషన్‌

Read Also: HHVM Event: పలు ఆంక్షలతో.. హరి హర వీరమల్లు’ ప్రీరిలీజ్‌ ఈవెంట్

Updated Date - Jul 21 , 2025 | 06:16 PM