Tollywood: పెళ్ళిపీటలెక్కబోతున్న అల్లు శిరీష్
ABN, Publish Date - Oct 01 , 2025 | 04:46 PM
అల్లు శిరీష్ వివాహ నిశ్చితార్థం నయనికతో ఈ నెల 31న జరుగబోతోంది. అల్లు రామలింగయ్య జయంతి రోజున ఈ శుభవార్తను అల్లు శిరీష్ తెలియచేయడం విశేషం.
ప్రముఖ హాస్యనటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, స్వర్గీయ అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) మనవడు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) మూడో కొడుకు అల్లు శిరీష్ (Allu Sirish) ఎట్టకేలకు పెళ్ళిపీటలు ఎక్కబోతున్నాడు. గత కొన్ని రోజులుగా అతని వివాహ నిశ్చితార్థంకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ అల్లు శిరీష్ అధికారికంగా సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశాడు. విశేషం ఏమంటే... అల్లు శిరీష్ వివాహ నిశ్చితార్థం వార్తను తాతయ్య అల్లు రామలింగయ్య జయంతి రోజున తెలియచేశాడు. నయనికతో తన వివాహ నిశ్చితార్థం అక్టోబర్ 31న జరిగిందని, ఇటీవల కన్నుమూసిన తన నానమ్మ ఉండి ఉంటే ఆవిడ ఎంతో సంతోషపడేదని అల్లు శిరీష్ ఆ ప్రకటనలో పేర్కొన్నాడు.
అల్లు అరవింద్ కు ముగ్గురు కొడుకులు కాగా... పెద్ద కొడుకు బాబీ మొదటి పెళ్ళి విడాకులకు దారి తీయడంతో రెండో పెళ్ళి చేసుకున్నాడు. అది లవ్ మ్యారేజ్. అల్లు అర్జున్ (Allu Arjun) స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. దాంతో అల్లు శిరీష్ వివాహం గురించి అందరూ ఎక్కువ చర్చించుకునే వారు. అయితే ఇంతకాలానికి అల్లు శిరీష్ కూడా పెళ్ళి మంటపం వైపు అడుగులు వేయడం అందరికీ ఆనందాన్ని కలిగిస్తున్న అంశం. అల్లు శిరీష్ వివాహ నిశ్చితార్థానికి సంబంధించి అధికారిక సమాచారం రావడంతో సినిమా రంగానికి చెందిన వారు, అభిమానులు అతనికి శుభాకాంక్షలు చెప్పడం మొదలు పెట్టారు.
Also Read: Tollywood: వసూళ్ళు కురిపించిన మూడు చిత్రాలు
Also Read: Idly Kottu: ఇడ్లీ కొట్టు మూవీ రివ్యూ