సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Allu Sireesh Engagement: దేవుడు మరోలా ప్లాన్ చేశాడు...

ABN, Publish Date - Oct 30 , 2025 | 01:07 PM

అల్లు శిరీష్‌ వివాహ నిశ్చితార్థ వేడుకకు తుఫాన్ దెబ్బ తగిలింది. దాంతో ఇప్పుడు ఓపెన్ ఎంగేజ్ మెంట్ ఆలోచన మార్చుకోవాల్సి వచ్చిందని శిరీష్ చెబుతున్నాడు.

Allu Sireesh Engagement

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) చిన్న కుమారుడు అల్లు శిరీష్ (Allu Sireesh) ఎట్టకేలకు పెళ్ళిపీటలు ఎక్కబోతున్నాడు. తాతయ్య అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) జయంతి సందర్భంగా అల్లు శిరీష్ తన పెళ్ళికి సంబంధించిన శుభవార్తను తెలియచేశాడు. అక్టోబర్ 31న నయనికతో తన వివాహ నిశ్చితార్థం జరుగబోతోందని, ఈ సమయంలో తన నానమ్మ ఉండి ఉంటే ఎంతో ఆనందించి ఉండేదని వాపోయాడు. అయితే... అల్లు శిరీష్ ఒకటి తలిస్తే దైవం వేరొకటి తలచినట్టు అయ్యింది.

అక్టోబర్ 31న గ్రాండ్ గా ఓపెన్ ప్లేస్ లో ఎంగేజ్ మెంట్ కు ఈ యంగ్ హీరో ప్లాన్ చేశాడు. కానీ ఊహించని విధంగా మొంథా తుఫాన్ అతని హ్యాపీనెస్ కు అడ్డు పడిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వానతో ఎంగేజ్ మెంట్ ప్లేస్ మొత్తం తడిచిపోయింది. ఇప్పుడు ఎంత భారీగా ఎండవచ్చినా అది ప్లేస్ ఆరే పరిస్థితి కనిపించడం లేదు.

దాంతో కాస్తంత డీలా పడిన అల్లు శిరీష్ తన ఎంగేజ్ మెంట్ జరగాల్సిన విడిది ఫోటోను ఇన్ స్టా స్టోరీలో పెట్టి 'అవుట్ డోర్ వింటర్ ఎంగేజ్మెంట్ ను ప్లాన్ చేసుకున్నాను. కానీ వాతావరణం, దేవుడు వేరే ప్లాన్ లో ఉన్నారు' అని కోట్ చేశాడు. ఏదేమైనా ప్రకృతిని అనుసరించి... వేడుకల్లో మార్పులు చేర్పులు చేసుకోక తప్పదు. ఇది సహజం. మరి రేపు ఏ స్థాయిలో అల్లు శిరీష్ ఎంగేజ్ మెంట్ జరుగుతుందో చూడాలి. ఎందుకంటే ఇది అల్లు వారి ఇంట జరుగుతున్న ఆఖరి వివాహ నిశ్చితార్థం.


ఇదిలా ఉంటే... దీపావళికి అల్లు అరవింద్ ఇంట్లో జరిగిన వేడుకకు కాబోయే కొత్త కోడలు నయనిక కూడా హాజరైంది. ఆమెతో కలిసి గ్రూప్ ఫోటో దిగిన కుటుంబ సభ్యులు... ఆమె ఫోటో మాత్రం సోషల్ మీడియాలో రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీపావళి ఫోటోలను తన సోషల్ మీడియాలో అకౌంట్ లో పోస్ట్ చేసిన అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి... అల్లు శిరీష్‌ కాబోయే భార్య ఆ ఫోటోలో కనిపించకుండా క్రాప్ చేసి పోస్ట్ చేయడం కూడా చర్చనీయాంశంగా మారిపోయింది.

Also Read: Avika Gor: నందు, అవికా గోర్ 'అగ్లీ స్టోరీ'...

Also Read: Mahakali: మహాకాళిగా కన్నడ నటి భూమి శెట్టి 

Updated Date - Oct 30 , 2025 | 02:44 PM