Aditya Music: కారులోనూ డాల్బీ క్వాలిటీతో సాంగ్స్...
ABN , Publish Date - Oct 17 , 2025 | 05:21 PM
ఆదిత్య మ్యూజిక్ సంస్థ డాల్బీ అట్మాస్ తో కలిసి క్వాలిటీ సౌండ్ ను మ్యూజిక్ లవర్స్ ఇవ్వడానికి కృషి చేస్తోంది. ఇటీవల విడుదలైన 'మిత్రమండలి' పాటలను కారులోనూ హై క్వాలిటీ తో వినే ఆస్కారాన్ని కల్పించింది.
సినిమా పాటలను ఆడియో క్యాసెట్స్ లో వినే రోజుల్లోనే ఆదిత్య మ్యూజిక్ (Aditya Music) కంపెనీ తన సత్తాను చాటింది. మారుతున్న కాలంతో పాటు సీడీ, ఎంపీ 3లలోకీ ఈ సంస్థ అడుగుపెట్టింది. బెటర్ మ్యూజిక్ ను శ్రోతలకు అందించడం కోసం ఆదిత్య మ్యూజిక్ సంస్థ అధినేత ఉమేశ్ గుప్తా (Umesh Guptha), సుభాష్ గుప్తా (Subhash Guptha) నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు. పైరసీని అరికట్టే విధంగా ఎప్పటికప్పుడు చర్చలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది ఆదిత్య మ్యూజిక్ సంస్థ. తాజాగా డాల్బీ అట్మాస్ సంస్థ థియేటర్లలో పాటలు విన్నప్పుడు ప్రేక్షకులు ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ను పొందుతారో అలాంటి ఎక్స్ పీరియన్స్ ను కారులోనూ పొందేలా ఈ రెండు సంస్థలు కృషి చేస్తున్నాయి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన 'మిత్ర మండలి' (Mitra Mandali) సినిమాల్లోని పాటలను అలా వినే ఆస్కారాన్ని ఈ సంస్థ కల్పించింది. శ్రోతలు దానిని ఎక్స్ పీరియన్స్ చేసే అవకాశాన్ని ఇటీవల డాల్బీ, ఆదిత్య మ్యూజిక్ సంస్థలు కల్పించాయి.
ఈ సందర్భంగా జరిగిన మీడియా మీట్ లో డాల్బీ సంస్థ ప్రతినిధి కరన్ మాట్లాడుతూ, 'ఫోన్ లో, లివింగ్ రూమ్ లో, డ్రైవింగ్ చేసే కారులో సైతం ఒకే రకమైన క్వాలిటీ మ్యూజిక్ ను వినే ఆస్కారం తాము కల్పించామని చెప్పారు. కేవలం నాలుగు స్పీకర్లతోనే మహేంద్ర 3 ఎక్స్ ఓ లో 360 డిగ్రీస్ సౌండ్ ను వినే ఆస్కారం కల్పించామని తెలిపారు. దానిని ఎక్స్ పీరియన్స్ చేయాల్సిందిగా కార్యక్రమంలో పాల్గొన్నవారిని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య మ్యూజిక్ తరఫున పాల్గొన్న దామోదర్ తమ సంస్థ తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకుని, శ్రోతలకు క్వాలిటీ మ్యూజిక్ అందిస్తోందో తెలిపారు. ఇందులో 'మిత్రమండలి'కి సంగీతం అందించిన సింగర్, రైటర్, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్. ధృవన్ (R. Dhruvan) కూడా పాల్గొని ఆదిత్య మ్యూజిక్ తో తనకున్న అనుబంధాన్ని తెలిపారు. 'మిత్రమండలి'లోని పాటలను కారులో డాల్బీ ఎట్మాస్ లో వినడం ఎంతో ఆనందంగా ఉందని, తన హోం థియేటర్ లో కూర్చుని విన్నట్టే ఉందని తెలిపారు.
Also Read: Jatadhara Trailer: ధన పిశాచి మారణకాండ.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న జటాధర ట్రైలర్
Also Read: Vijay Devarakonda: హిట్ కోసం విజయ్ కష్టాలు.. మంచి డైరెక్టర్ నే పట్టాడు