Adi Saikumar: మరోమారు.. తండ్రి కాబోతున్న ఆది సాయికుమార్! డిసెంబర్‌లో సినిమా.. జనవరిలో శుభవార్త

ABN , Publish Date - Nov 27 , 2025 | 08:51 PM

మరోసారి తాను తండ్రిని కాబోతున్నట్టు ఆది సాయికుమార్ తెలిపాడు. అతని కొత్త సినిమా 'శంబాల' డిసెంబర్ 25న విడుదల కాబోతోంది. జనవరిలో తన భార్య డెలివరీ ఉందనే వార్తను అతను సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

Aadi Saikumar

డైలాగ్ కింగ్ సాయి కుమార్ (Saikumar) మరోసారి తాత కాబోతున్నారు. సాయికుమార్ తనయుడు ఆది (Aadi Saikumar) తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ నటుడు అయ్యాడు. 'ప్రేమ కావాలి' (Prema Kavali) సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించి... దాదాపు పదిహేనేళ్ళుగా వైవిధ్యమైన చిత్రాలలో నటిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయి విజయాలు అతనికి దక్కకపోయినా... తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు.


ఈ యేడాది ఆది సాయికుమార్ నటించిన 'షణ్ముఖ' సినిమా విడుదలైంది. కానీ పరాజయం పాలైంది. దాంతో త్వరలో విడుదల కాబోతున్న 'శంబాల' మూవీ మీద అతను ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత సహజంగానే ఈ ప్రాజెక్ట్ మీద అందరికీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీతో మరోసారి ఆది సాయికుమార్ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చే ఆస్కారం ఉందని ట్రేడ్ వర్గాలు సైతం చెబుతున్నాయి. డిసెంబర్ 25న 'శంబాల' విడుదల కాబోతుండగా, ఆది సాయికుమార్ మరో శుభవార్తను తెలియచేశాడు. తను మరోసారి తండ్రి కాబోతున్నానని తెలిపాడు.

ఆది సాయికుమార్ వివాహం అరుణతో 2014లో అయ్యింది. వారిది ప్రేమ వివాహం. ఈ జంటకు ఇప్పటికే అయానా అనే పాప ఉంది. మరోసారి తను తండ్రి కాబోతున్నానని, జనవరిలో న్యూ బేబీ తమ కుటుంబంలోకి రాబోతోందని ఆది సాయికుమార్ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. దీంతో సాయికుమార్, ఆది సాయికుమార్ అభిమానులంతా కొత్తగా రాబోతున్న బేబీకి ముందస్తు శుభాశీస్సులు అందిస్తున్నారు.

Also Read: Hindi Cinema: ఉంచుతాయో.. ముంచుతాయో! బాలీవుడ్‌.. ఆశ‌ల‌న్నీ వాటి పైనే

Also Read: Friday Tv Movies: శుక్ర‌వారం, Nov 28,, తెలుగు టీవీ ఛానళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు ఇవే

Updated Date - Nov 27 , 2025 | 09:19 PM