సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rizana: ఆస్కార్ విన్నర్ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్

ABN, Publish Date - Jun 25 , 2025 | 03:34 PM

ప్రముఖ నటి వరలక్మీ శరత్ కుమార్ ఇప్పుడో అంతర్జాతీయ ప్రాజెక్ట్ లో భాగస్వామి అయ్యారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో ఆస్కార్ విజేత సరసన ఆమె నటిస్తున్నారు.

ప్రముఖ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalakshmi Sarathkumar) హాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ప్రఖ్యాత బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ సరసన నటిస్తున్నారు. వెటరన్ దర్శకుడు చంద్రన్ రత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శ్రీలంకలో చిత్రీకరించబడింది. 'రిజానా - ఎ కేజ్డ్ బర్డ్' అనే ఈ మూవీ వాస్తవ గాథ ఆధారంగా రూపొందించబడుతోంది.


'రిజానా' మూవీ గురించి వరలక్ష్మి మాట్లాడుతూ, 'ఆస్కార్ అవార్డు గెలుచుకున్న జెరెమీ ఐరన్స్ వంటి గొప్ప నటుడితో కలిసి పనిచేయడం నిజంగా ఒక కల నెరవేరినట్టు అనిపిస్తోంది. 'లయన్ కింగ్‌' సినిమాలో స్కార్ పాత్రకు ఆయనే వాయిస్ ఇచ్చారు. ఆ సినిమా నాకు చాలా ఇష్టం. అన్ని డైలాగ్స్ నాకు పక్కా గుర్తుండిపోయేంతగా ఆ మూవీని చూశాను. ఇప్పుడా సినిమాకు వాయిస్ ఇచ్చిన నటుడితో స్క్రీన్ షేర్ చేసుకోవడమనేది ఒక గొప్ప అవకాశం. అలానే చంద్రన్ రత్నం గారి దర్శకత్వంలో పనిచేయడం కూడా నాకు గర్వకారణం. శ్రీలంకలోనే కాదు, ప్రపంచ సినిమాకే ఆయన కొత్త దారులు చూపిన దర్శకుడు. ఇలాంటి అద్భుతమైన అంతర్జాతీయ స్టార్స్‌తో కలిసి పనిచేసే అవకాశం నాకు దొరికినందుకు ఆనందంగా వుంది. ఇది నా కెరీర్‌లో మరిచిపోలేని ఒక మైలురాయి' అని అన్నారు.

Also Read: Sreeleela: తప్పుకుందా... తప్పించారా...

Also Read: Vijay Antony: ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం కొత్తేమి కాదు.. శ్రీకాంత్ అరెస్ట్ పై విజయ్ స్పందన

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Jun 25 , 2025 | 03:36 PM