సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tron: Ares: సరైన సమయంలో 'ట్రాన్ ఆరెస్'

ABN, Publish Date - Oct 06 , 2025 | 03:57 PM

డిస్నీ సంస్థ నిర్మించిన 'ట్రాన్: ఆరెస్' ఈ నెల 10 విడుదల కాబోతోంది. ఎ.ఐ. ద్వారా ఈ సమాజానికి ఎలాంటి కీడు జరుగుతుందో ఈ సినిమాలో చూపించామని మేకర్స్ చెబుతున్నారు.

Tron Ares movie

డిస్నీ (Disney) సంస్థ రూపొందించిన తాజా సైన్స్ ఫిక్షన్ మూవీ 'ట్రాన్ : ఆరెస్' (Tron : Ares) అక్టోబర్ 10వ తేదీ వరల్డ్ వైడ్ వివిధ భాషల్లో, వివిధ దేశాల్లో విడుదల కాబోతోంది. ఇండియాలో ఇంగ్లీష్‌, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో వస్తోంది. ఇటీవల లండన్ లో జరిగిన ప్రీమియర్ షో సందర్భంగా లీడ్ యాక్టర్ జారెడ్ లెటో (Jared Leto) ఈ సినిమా గురించి మాట్లాడుతూ, 'మేం ఈ సినిమా మీద తొమ్మిది పదేళ్ళ కిత్రం పని చేయడం మొదలు పెట్టాం. అప్పట్లో ఎవరూ ఎ.ఐ. గురించి మాట్లాడేవారు కదా. ఇవాళ ఎ.ఐ. అనేది మన జీవితాలలో ఒకభాగంగా మారిపోయే పరిస్థితి వచ్చింది. ఈ సినిమా ఎ.ఐ. మీదనే సాగుతుంది' అని అన్నారు.


ఈ సినిమాలో జారెడ్ సహ నటి జోడీ టర్నర్ స్మిత్ (Jodie Turner-Smith) మాట్లాడుతూ, 'మేం ఈ సినిమాను ఒకటిన్నర సంవత్సరాల క్రితం షూట్ చేశాం. అయితే... ఇవాళ్టి రోజుని ముందే పసిగట్టి దానికి అనుగుణంగా కథను రాసుకోవడం, సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది. ఇవాళ ఎ.ఐ. జనాల్లోకి చొచ్చుకుపోయిన నేపథ్యంలో ఈ సినిమాలోని సన్నివేశాలు మరింత రిలవెంట్ గా అనిపిస్తాయి' అని అన్నారు. 'ఎ.ఐ. వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అని దురుపయోగకరమైనవీ ఉన్నాయని జోడీ చెబుతూ, అయితే ఎ.ఐ.ని మానవ కేంద్రీకృతంగా ఎలా ఉంచాలనే విషయం మీద మనవాళ్ళు ఆలోచన చేయాల్సి ఉందని అన్నారు. ఎ.ఐ. వల్ల ఎలాంటి అరాచకాలు జరిగే ఆస్కారం ఉందో 'ట్రాన్: ఆరెస్'లో చూపించామని మేకర్స్ చెబుతున్నారు.

Also Read: Srinidhi Shetty: ఆ హీరోలతో సినిమా.. రాత్రింబవళ్లు కష్టపడతా

Also Read: Akkineni Naga Chaitanya: ఆ సినిమా చేయకూడదని చాలా ప్రయత్నించా.. కానీ వదల్లేదు

Updated Date - Oct 06 , 2025 | 03:59 PM