సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tom Cruise: కుర్ర హీరోయిన్ తో టామ్ క్రూజ్ బ్రేకప్..

ABN, Publish Date - Oct 18 , 2025 | 04:20 PM

హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ (Tom Cruise) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Tom Cruise

Tom Cruise: హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ (Tom Cruise) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాక్షన్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక 63 ఏళ్ల వయస్సులో కూడా చెక్కు చెదరని అందం, ఫిట్ నెస్ తో అదరగొడుతూ ఉంటాడు. కేవలం విలన్స్ నే కాదు అమ్మాయిలను పడగొట్టడంలో కూడా టామ్ సిద్ధహస్తుడు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకొని.. వారి నుంచి విడిపోయి.. ఈ మధ్యనే నాలుగో పెళ్ళికి సిద్దమయ్యాడు అని వార్తలు వచ్చాయి.

కుర్ర హీరోయిన్ అనా డి అర్మాస్ తో టామ్ దాదాపు 9 నెలలుగా డేటింగ్ చేస్తున్నాడు. టామ్ వయస్సు 63, అనా డి అర్మాస్ వయస్సు 37. తన వయస్సులో సగం ఉన్న హీరోయిన్ తో టామ్ డేటింగ్ చేయడమే కాకుండా పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఇద్దరు ఈసారి చాలా గ్రాండ్ గా వివాహాం చేసుకోనున్నారని, స్పేస్ లో వీరి వివాహాం గ్రాండ్ గా జరగనుందని టాక్ నడిచింది. రేపో మాపో వీరిద్దరి వివాహా ఫోటోలు స్పేస్ నుంచి వస్తాయి అనుకుంటే సడెన్ గా కుర్ర హీరోయిన్ కి టామ్ బ్రేకప్ చెప్పినట్లు సమాచారం అందుతుంది.

దాదాపు తొమ్మిది నెలలుగా ప్రేమలో ఉన్న ఈ జంట విడిపోవాలని నిర్ణయించుకున్నారట. వీరిమధ్య కొన్ని విభేదాలు తలెత్తడంతో భార్యభర్తలుగా తాము కలిసి ఉండలేమని భావించి స్నేహితులుగానే కొనసాగాలని అనుకుంటున్నట్లు, అందుకే పెళ్లి క్యాన్సిల్ చేసినట్లు హాలీవుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

అంతేకాకుండా ఈ బ్రేకప్ వలన వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కూడా ఆగిపోయిందని సమాచారం. టామ్ మరియు అనా డి అర్మాస్ జంటగా డీపర్ అనే సూపర్ నేచురల్ థ్రిల్లర్‌లో కలిసి నటించాల్సి ఉంది. కానీ ఈ బ్రేకప్ వలన అది ఆగిందని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Samantha: నేను సెక్సీ కాదు.. బోల్డ్ రోల్స్ నాకెవ్వరూ ఇవ్వలేదు

Prabhas: 'ది రాజా సాబ్'.. మళ్ళీ వాయిదా?


Updated Date - Oct 18 , 2025 | 04:20 PM