Samantha: నేను సెక్సీ కాదు.. బోల్డ్ రోల్స్ నాకెవ్వరూ ఇవ్వలేదు
ABN , Publish Date - Oct 18 , 2025 | 03:23 PM
ఇండస్ట్రీలో సమంత (Samantha) స్టార్ హీరోయిన్ గా ఏ రేంజ్ కు ఎదిగిందో అందరికీ తెల్సిందే
Samantha: ఇండస్ట్రీలో సమంత (Samantha) స్టార్ హీరోయిన్ గా ఏ రేంజ్ కు ఎదిగిందో అందరికీ తెల్సిందే. గత కొంతకాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉన్నా కూడా ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక కొంతమంది హీరోయిన్లు తమ తప్పులను ఒప్పుకోవడానికి కష్టపడుతుంటారు. కానీ, సామ్ అలా కాదు.. తాను తప్పులు చేశాను అని బహిరంగంగా ఒప్పుకుంది.
ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్ లో పాలుపంచుకున్న సమంత తన మనసులోని భావాలను ఏ మాత్రం దాచుకోకుండా చెప్పుకొచ్చింది. తన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటివరకు తన జీవితంలో జరిగిన ప్రతి విషయం ప్రజలకు తెలిసేలాగే జరిగిందని, ట్రోల్స్ ఎన్ని వచ్చినా ఎదుర్కొని నిలబడినట్లు తెలిపింది. ప్రతి ఒక్కరికీ ఓ ఆశయమంటూ ఉండాలని, అందుకు తగ్గ సదుద్దేశం కూడా తోడవ్వాలని సమంత చెప్పుకొచ్చింది.
ఇక సామ్ కెరీర్ ను మార్చిన విషయం పుష్ప లో ఐటెం సాంగ్ చేయడం. ఇది ఆమెపై ట్రోలింగ్ ను మరింత పెంచింది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్నాకా బయట ఎక్కడా కనిపించని సామ్.. ఊ అంటావా.. ఊఊ అంటావా సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది పూర్తిగా తన డెసిషన్ అని చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు మూస పాత్రలు చేసి కొత్తగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఈ సాంగ్ ఆఫర్ వచ్చిందని, ఐటెంసాంగ్ చేస్తే ఎలా ఉంటుందో చూడడానికే ఆ సాంగ్ చేసినట్లు తెలిపింది.
ఇక సామ్ తన బాడీ గురించి చెప్పుకొచ్చింది. తాను సెక్సీగా ఉంటానని నాకే అనిపించదు అని, అందుకే డైరెక్టర్స్ సైతం బోల్డ్ రోల్స్ ఇవ్వలేదని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పటివరకు తన జీవితంలో ఎదురైన ఎదురుదెబ్బలను పాఠాలుగా గుర్తు చేసుకుంటూ ముందుకు సాగుతాననీ తెలిపింది. ప్రస్తుతం సామ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Thamma: రశ్మిక మందణ్ణ 'థామా' రన్ టైమ్ ఎంతంటే...
K-Ramp Review: కిరణ్ అబ్బరం లవ్ స్టోరీ K- ర్యాంప్ ఎలా ఉందంటే