Siddharth: హాలీవుడ్.. వెబ్ సిరీస్‌లో సిద్ధార్థ్
ABN, Publish Date - Sep 21 , 2025 | 09:51 AM
ఇటీవల ‘3 బీహెచ్‌కే’ మూవీతో మంచి విజయంతో పాటు సినీ విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు అందుకున్న సిద్ధార్థ్ ఓ జాక్‌పాట్ కొట్టాడు.
ఇటీవల ‘3 బీహెచ్‌కే’ మూవీతో మంచి విజయంతో పాటు సినీ విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు అందుకున్న సిద్ధార్థ్ (Siddharth) ఓ జాక్‌పాట్ కొట్టాడు. తాజాగా ఆయన ఓ హాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ‘అన్‌కస్టమైజ్డ్ ఎర్త్’ (Unaccustomed Earth (TV Series)) అనే పేరుతో రూపుదిద్దుకునే ఈ వెబ్ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్‌లు. తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కనుంది. ఫ్రిధా పింటో కథానాయిక (Freida Pinto) కాగా రితేష్ భద్ర దర్శకుడు. వార్నర్ బ్రదర్స్ టెలివిజన్ (Warner Bros. Television) తో కలిసి జాన్‌వెల్స్ ప్రొడక్షన్స్ (John Wells Productions) నిర్మిస్తుంది.
ప్రేమ, సంస్కృతి సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ నిర్మించే ఈ వెబ్‌సిరీస్‌ను అన్ని వర్గాల ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేసేలా రూపొందించనున్నట్టు దర్శకుడు వెల్లడించారు. బాధ్యత కలిగిన ఒక గృహిణి.. తన మాజీ ప్రియుడిని చూడగానే ఆమె జీవితంలో చోటుచేసుకునే మార్పులు, ఒక వ్యాపారవేత్త తన బిజినెస్, ప్రేమ బ్యాలెన్స్ చేయలేక ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారన్న రెండు వేర్వేరు కథాంశాలను బ్యాలెన్స్ చేస్తూ రూపొందిస్తున్నట్టు దర్శకుడు వివరించారు.