Raj Dasireddy: అమెరికాలో హీరో రాజ్ దాసిరెడ్డి సందడి

ABN , Publish Date - Oct 23 , 2025 | 06:19 PM

మారుతీ కథను అందించిన 'భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ' చిత్రంలో హీరోగా నటించిన రాజ్ దాసిరెడ్డి ప్రస్తుతం అమెరికాలో తన తదుపరి చిత్రం కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు.

Actor Raj Dasireddy

ఆంగ్ల బానిసత్వం అని ఒకవైపు తిట్టుకుంటాం కానీ సినిమా రంగాన్ని కొన్ని దశాబ్దాలుగా అమెరికాలోని హాలీవుడ్ జాడ్యం వదిలిపెట్టడం లేదు. అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ హీరోలు సైతం హాలీవుడ్ ను అనుకరించే విధంగా హిందీ సినిమా రంగాన్ని బాలీవుడ్ అని సంబోధించవద్దని కోరుతూ ఉంటారు. అలానే 'భారతీయ సినిమా' అనే పదాన్నే ఇక్కడి అన్ని భాషాల చిత్రాలను వర్తింప చేయాలని చెబుతూ ఉంటారు. కానీ హాలీవుడ్ ప్రేరణతో ఇప్పటికీ మనం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ ఉడ్, మల్లు ఉడ్ అనే పిలుచుకుంటున్నాం. అంతగా హాలీవుడ్ చిత్ర పరిశ్రమ మనల్ని ప్రభావితం చేసింది. ఇక అవార్డుల విషయానికి వస్తే ఆస్కార్ కూడా అలాంటి ప్రభావాన్నే ప్రపంచ సినిమా రంగం మీద చూపిస్తోంది. తొలిసారి తెలుగు సినిమా 'ట్రిపుల్ ఆర్' ఆస్కార్ అవార్డును పొంది... దానిని అందుకోవడం అసాధ్యం కాదని నిరూపించింది. ఇప్పటికే తెలుగువారు ఆస్కార్ వేడుకల్లో పాల్గొనడం, అక్కడకు అతిథులుగా వెళ్ళడం, జ్యూరీలో భారీ స్థాయిలో చోటు సంపాదించుకోవడం చేస్తున్నారు. నిదానంగా హాలీవుడ్ లోనూ, ఆస్కార్స్ లోనూ తెలుగువారు తమ ఉనికిని చాటే ప్రయత్నం చేస్తున్నారు.


ఇంతకూ విషయం ఏమంటే... ఈ యేడాది జరిగిన ఆస్కార్ సంబరాల్లో మన తెలుగు నటుడు రాజ్ దాసిరెడ్డి సైతం అక్కడ పాల్గొన్నాడు, సందడి చేశాడు. 'ది రాజా సాబ్'తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోబోతున్న దర్శకుడు మారుతి కథను అందించిన 'భద్రం బి కేర్ ఫుల్ బ్రదరు' మూవీలో రాజ్ దాసిరెడ్డి హీరోగా నటించాడు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న రాజ్ దాసిరెడ్డి 'హాలీవుడ్ వాక్ ఆఫ్‌ ఫేమ్', 'న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ - 2025'లోనూ పాల్గొని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్న తన తదుపరి చిత్రం కోసం రాజ్ దాసిరెడ్డి ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్టు తెలిపాడు.

Also Read: Friday Tv Movies: శుక్ర‌వారం, అక్టోబ‌ర్ 24, తెలుగు టీవీ ఛానళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు ఇవే

Also Read: MSG: చిరు సెట్లోకి వెంకీ మామ ఎంట్రీ అదిరింది

Updated Date - Oct 23 , 2025 | 06:31 PM