The Last Bus: సలార్ మ్యూజిక్.. కాపీ కొట్టిన హాలీవుడ్ మూవీ
ABN, Publish Date - Oct 10 , 2025 | 06:21 PM
హాలీవుడ్ పాటలు కాపీ చేసి దొరికిపోయిన ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్లు చాలా మంది కనిపిస్తున్నారు. ఎవరూ చూడలేరేమో అని.. ఎక్కడిదో సినిమాను కాపీ చేసి, కవర్ చేసుకున్నా ఎప్పుడోసారి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడుతుంటారు. అయితే మొట్ట మొదటి సారి ఈ సీన్ రివర్స్ అయింది. ఇండియన్ సినిమా మ్యూజిక్ నే కాపీ కొట్టి దొరికిపోయారు హాలీవుడ్ మేకర్స్.
అన్ని ఇండస్ట్రీలను కాపీ జాడ్యం పట్టిపీడిస్తోంది. సొంత తెలివి కంటే కూడా కాపీ చేసేవాళ్లే ఎక్కువైపోతున్నారు. సినిమా నాలెడ్జ్ తక్కువ ఉన్నవాళ్లు కాపీ చేశారనుకుంటే ఏమో అనుకోవచ్చు.. బడా బడా సినిమాలు కూడా ఈ సమస్యను ఎదుర్కోవడం చర్చనీయాంశంగా మారుతోంది. ఈ మధ్యకాలంలో అయితే చాలా సినిమాలు కాపీ వివాదంలో పడుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా ప్రతి ఇండస్ట్రీలోనూ కాపీ కాంట్రవర్సరీలు కొనసాగుతున్నాయి. తాజాగా కాపీ మరకలు హలీవుడ్ (Hollywood )ఇండస్ట్రీని తాకాయి.
హాలీవుడ్ మూవీ 'ద లాస్ట్ బస్' (The Last Bus) వివాదంలో చిక్కుకుంది. ఇండియన్ సినిమా మ్యూజిక్ ను కాపీ చేసిందని ఇంటర్నెట్ లో బిగ్ డిబేట్ నడుస్తోంది. ఆ సినిమా మరేదో కాదు.. రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన 'సలార్' (Salaar) బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను ఈ హాలీవుడ్ సినిమా కాపీ చేసిందని సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది.
ఆపిల్ టీవీ (Apple TV) లో వచ్చిన 'ద లాస్ట్ బస్' సినిమా ప్రోమో వీడియోలో 1:13 సెకన్ల వద్ద వచ్చే BGM, 'సలార్' లో రవి బస్రూర్ (Ravi Basrur) కంపోజ్ చేసిన మ్యూజిక్‌లా ఉందని తెలుస్తోంది. అయితే మక్కికి మక్కి 'సలార్' BGMనే కాపీ చేశారని కొందరు అంటుంటే.. మరికొందరు అలాంటిదే కానీ పూర్తిగా సేమ్ కాదు అని వాదిస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ మరో అడుగు ముందుకు వేసి.. 'సలార్' టీమ్, హోంబలే ఫిల్మ్స్ ఆపిల్ టీవీపై కేసు వేయాలని కోరుతున్నారు. కానీ ఇంకా ఎవరూ స్పందించలేదు. అయితే ఈ క్లిప్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
'ద లాస్ట్ బస్' సినిమాను పాల్ గ్రీన్‌గ్రాస్ డైరెక్ట్ చేశారు. మాథ్యూ మెక్‌కానహే, అమెరికా ఫెరెరా హీరో, హీరోయిన్‌లు చేశారు. అక్టోబర్ 3న ఆపిల్ టీవీ+లో ప్రమోషనల్ వీడియో విడుదలైంది. మొత్తానికి ఈ వివాదం తర్వాత భారతీయ మ్యూజిక్ గ్లోబల్‌గా చేరుకుందని అంటున్నారు.'ద లాస్ట్ బస్' మ్యూజిక్ డైరెక్టర్ జేమ్స్ న్యూటన్ హోవార్డ్ మరి మన 'సలార్' చూసే ఇన్ స్పైర్ అయ్యారా? లేక 'సలార్'లో వినిపించిన నేపథ్య సంగీతం ఏ దేశ సంగీతానికైనా అనుసరణనా అన్న అనుమానాలూ వస్తున్నాయి.
Read Also: They Call Him OG: సువ్వి సువ్వి సువ్వాలా.. వీడియో సాంగ్ వచ్చేసింది
Read Also: Deepika Padukone: కల్కి నుంచి అవుట్.. ఎట్టకేలకు నోరువిప్పిన దీపికా