సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

TRON:'ట్రాన్: ఏరీస్' ట్రైలర్ రిలీజ్

ABN, Publish Date - Sep 05 , 2025 | 06:41 PM

సైన్స్ ఫిక్షన్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ది మోస్ట్ అవెయిటెడ్ మూవీ సందడి చేసేందుకు రెడీ అవుతోంది. సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు.. మేకర్స్ తొలి గిఫ్ట్ ఇచ్చేశారు..

హాలీవుడ్ మూవీ ఫ్రాంచైజీ ట్రాన్ కు ఉన్న ఆదరణ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సైన్స్ ఫిక్షన్‌ చిత్రాల్లో ఇదో మాస్టర్ పీస్ గా చెప్పుకుంటారు. 1982లో విడుదలైన ట్రాన్, 2010లో వచ్చిన ట్రాన్: లెగసీ ( TRON: Legacy) మూవీలు సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఈ క్రమంలో మూడవ చాప్టర్‌ అయిన 'ట్రాన్: ఏరీస్' ( TRON: Ares) కూడా అలరించేందుకు రెడీ అవుతోంది. ఇందుకు సంబంధించి తాజాగా కొత్త పోస్టర్, ట్రైలర్‌ను డిస్నీ (Disney) విడుదల చేసింది. ఈ మూవీ స్టోరీపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది.


'ట్రాన్: ఏరీస్' కథ డిజిటల్ ప్రపంచం నుండి వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెట్టే అధునాతన ప్రోగ్రామ్ ఏరీస్‌ చుట్టూ తిరుగుతుంది. ఈ ప్రమాదకర మిషన్ మానవజాతి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మధ్య మొదటి ఎన్‌కౌంటర్‌గా నిలుస్తుంది. జారెడ్ లేటో (Jared Leto) ప్రధాన పాత్రలో నటిస్తుండగా, జెఫ్ బ్రిడ్జెస్ (Jeff Bridges) తన ఐకానిక్ పాత్రలో మరోసారి కనిపించనున్నారు. గ్రెటా లీ (Greta Lee) , ఎవాన్ పీటర్స్, హసన్ మినహాజ్, జోడీ టర్నర్-స్మిత్, గిల్లియన్ ఆండర్సన్ వంటి అంతర్జాతీయ తారాగణం సినిమాకి మరింత ఆకర్షణను తెస్తుందని చెప్పుకుంటున్నారు.

'ట్రాన్ ఏరీస్' సినిమాకు జోయాకిమ్ రోన్నింగ్ (Joachim Rønning) దర్శకత్వం వహించగా, గ్రామీ అవార్డు గెలుచుకున్న నైన్ ఇంచ్ నైల్స్ బ్యాండ్ అందించిన “As Alive As You Need Me To Be” గీతం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇండియాలో ఈ సినిమా అక్టోబర్ 10, 2025న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. మరి మూడవ చాప్టర్ ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి..

Read Also: Anushka Moni Mohandas: వ్యభిచార దందా.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన హీరోయిన్

Read Also: Mana Shankaravaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్‌గారు’ మరో అప్‌డేట్‌ వచ్చేసింది

Updated Date - Sep 05 , 2025 | 06:46 PM