Demon Slayer: యానిమేటెడ్ డార్క్ ఫాంటసీ థ్రిల్లర్
ABN , Publish Date - Aug 19 , 2025 | 10:16 AM
జపాన్ లో తెరకెక్కిన యానిమేటెడ్ డార్క్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ 'డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా – ఇన్ఫినిటీ క్యాసిల్'. హరుఓ సోటోజాకి డైరెక్ట్ చేసిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
జపాన్ లో తెరకెక్కిన యానిమేటెడ్ డార్క్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ 'డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా – ఇన్ఫినిటీ క్యాసిల్' (Demon Slayer: Kimetsu no Yaiba – The Movie: Infinity Castle). హరుఓ సోటోజాకి డైరెక్ట్ చేసిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా ఇపుడు తెలుగులోనూ రానుంది. తాజాగా తమిళ, తెలుగు ట్రైలర్లను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఎపిక్ ట్రైలజీ యొక్క ఫస్ట్ పార్ట్ ని భారతదేశంలో సెప్టెంబర్ 12న విడుదల అవుతుంది. మనుషులు, రాక్షసుల మధ్య జరిగే విషాదగాథ ఇది. కత్తి యుద్ధాలు, ఆకట్టుకునే కారక్టర్స్, కామెడీ సీన్స్ తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తుందినే నమ్మకాన్ని మేకర్స్ వ్యక్తం చేశారు. సినిమా మొత్తం మూడు భాగాలుగా రానుంది ఈ చిత్రాన్ని జపాన్, కొన్ని ఆసియా దేశాల్లో తప్ప, ప్రపంచవ్యాప్తంగా క్రంచిరోల్ మరియు సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు రిలీజ్ చేయనున్నారు. IMAX, ప్రీమియం లార్జ్ ఫార్మాట్‌లలో కూడా రిలీజ్ కాబోతుంది. జపనీస్‌లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో పాటు, ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో డబ్బింగ్ చేశారు.
కథ విషయానికి వస్తే: టాంజిరో కామాడో అనే పిల్లోడి ఫ్యామిలీని ఒక రాక్షసుడు చంపేస్తాడు. అతని చెల్లెలు నెజుకో రాక్షసిగా మారుతుంది. ఆమెను మళ్లీ మాములు మనిషిలా తిరిగి మార్చాలనే సంకల్పంతో టాంజిరో డీమన్ స్లేయర్ కార్ప్స్లో చేరతాడు. తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ.
READ ALSO: Rahul Sipligunj: తంతే బూరెల బుట్టలో పడ్డ రాహుల్.. టీడీపీ నేత కూతురుతో పెళ్లి
CM Revanth Reddy: భారతీయ సినిమా నిర్మాణ కేంద్రంగా హైదరాబాద్
Sasivadane: అందమైన ప్రేమ కథ.. విడుదల ఎప్పుడంటే
Tribanadhari Barbarik: డేట్ మారింది.. మంచి థియేటర్ల కోసమే..