Rahul Sipligunj: తంతే బూరెల బుట్టలో పడ్డ రాహుల్.. టీడీపీ నేత కూతురుతో పెళ్లి

ABN , Publish Date - Aug 18 , 2025 | 10:12 PM

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫోక్ సాంగ్స్ తో పక్కా తెలంగాణ సింగర్ గా రాహుల్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు.

Rahul Sipligunj

Rahul Sipligunj: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫోక్ సాంగ్స్ తో పక్కా తెలంగాణ సింగర్ గా రాహుల్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ గుర్తింపుతోనే బిగ్ బాస్ కు వెళ్లి.. విన్నర్ గా గెలిచి మరింతమంది అభిమానులను గెలుచుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ పాడి ఆస్కార్ అవార్డును సైతం గెలుచుకొని పాన్ ఇండియా లెవెల్లో రాహుల్ తన సత్తా చాటాడు.


ప్రస్తుతం నటుడిగా, సింగర్ గా బిజీగా ఉన్న రాహుల్ ఆగస్టు 17 న సింపుల్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. దీంతో రాహుల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు.. ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ? అని పలువురు అభిమానులు ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఇక కొందరు ఆ అమ్మాయి గురించి తెలియగానే రాహుల్ తంతే బూరెల బుట్టలో పడ్డాడు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు ఆ అమ్మాయి ఎవరు.. ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనేది తెలుసుకుందాం రండి.


రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్ మెంట్ చేసుకున్న అమ్మాయి పేరు హరిణ్య రెడ్డి. టీడీపీ సీనియర్ నేత, నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (NUDA) ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్న కూతురే ఈ హరిణ్య రెడ్డి. 2020 లో రాహుల్, హరిణ్యల మధ్య పరిచయం ఏర్పడింది. ఐదేళ్లుగా ఈ జంట పప్రేమించుకుంటున్నారు. హరిణ్య బిగ్ బాస్ నిర్వహించే ఎండేమోల్ షైన్ కంపెనీకి ప్రొడ్యూసర్ గా పనిచేసింది. ప్రస్తుతం ఆమె ఓకే పెద్ద కంపెనీలో పనిచేస్తుందని టాక్. ఇక హరిణ్య కుటుం బం మొత్తం నందమూరి బాలకృష్ణకు దగ్గర సన్నిహితులు అని చెప్పుకుంటున్నారు.


తాజాగా టీడీపీ సీనియర్ నేత, నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (NUDA) ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తన అన్న కూతురు ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ నూతన వధూవరులను అభినందించాడు. 'ఆస్కార్ అవార్డు పొందిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో మా అన్న కూతురు హరణ్యా రెడ్డి నిశ్చితార్థం హైదరాబాదులోని ITC కోహినూర్ లో ఘనంగా జరిగింది. పెద్దలు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరగడం సంతోషంగా ఉంది' అంటూ చెప్పుకొచ్చాడు. ఏదిఏమైనా రాహుల్ మంచి కుటుంబానికే అల్లుడిగా వెళ్తున్నాడని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Tuesday Tv Movies: మంగ‌ళ‌వారం.. తెలుగు టీవీ మాధ్య‌మాల్లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే.

Dharma Mahesh: భార్యపై వేధింపులు.. కుర్ర హీరోపై కేసు నమోదు

Updated Date - Aug 18 , 2025 | 10:14 PM