The Odyssey: ప్రపంచమంతా పిచ్చిగా.. ఎదురు చూస్తున్న ట్రైలర్ వచ్చేసింది.
ABN, Publish Date - Dec 22 , 2025 | 10:05 PM
ఇన్‌సెప్సన్, ఇన్‌స్టా స్టెల్లార్, టెనెట్, ఓపెన్ హైమర్ వంటి భారీ క్రియేటివ్ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా మూవీ జీనియస్ అనే బిరుదు దక్కించుకున్న ది గ్రేట్ డైరెక్టర్ క్రిష్టోఫర్ నోలన్
ఇన్‌సెప్సన్, ఇన్‌స్టా స్టెల్లార్, టెనెట్, ఓపెన్ హైమర్ వంటి భారీ క్రియేటివ్ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా మూవీ జీనియస్ అనే బిరుదు దక్కించుకున్న ది గ్రేట్ డైరెక్టర్ క్రిష్టోఫర్ నోలన్ (Christopher Nolan). కాస్త విరామం తర్వాత ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ది ఓడిస్సీ (The Odyssey). ఎంతో ప్రాచుర్యం పొందిన గ్రీకు పురాణ జానపద గాధ ఆధారంగా తెరకెక్కుతోంది. చిత్రీకరణ ఆరంభం నుంచే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేలా ఉండగా ఇంకా హైప్ అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. కాగా మూవీ రిలీజ్ ఏడాది ఉండగానే అల్రేడీ అడ్వాన్స్ బుకింగ్స్ సైతం పూర్తి చేసుకుందంటే ఈ సినిమాపై ముఖ్యంగా డైరెక్టర్‌కు ఎంత క్రేజ్ ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
అయితే.. జూలై 17 న ఈ చిత్రం థియేటర్లకు వచ్చేందుకు ముస్తాబైంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌ను చూస్తే సినిమా ఎలా ఉండబోతుందనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఇతాకా అనే సామ్రాజ్యాన్ని పాలించే రాజు ఒడిస్సియస్ ట్రోజన్ యుద్ధం ముగించుకుని తన స్వదేశానికి వెల్లి తన తల్లి, భార్యను కలవడానికి తిరిగి ప్రయాణం ఆరంభించినప్పుడు జరిగిన పరిణామాల నేపథ్యంలో సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టేలా అద్భుతమైన విజువల్ వండర్‌గా, అడ్వెంచరస్ జర్నీగా రూపొందించారు.
ఈ భారీ ప్రతిష్టాత్మక చిత్రంలో రాజుగా మాట్ డామన్ (Matt Damon) అతని కుమారుడిగా టామ్ హాలండ్ (Tom Holland) లీడ్ రోల్స్‌లో నటించగా అన్నా హాత్‌వే (Anne Hathaway), రాబర్ట్ ప్యాటిన్సన్ (Robert Pattinson), లుపిటా న్యోంగో (Lupita Nyong'o), జెండాయ (Zendaya), చార్లిజ్ థెరాన్ (Charlize Theron) కీలక పాత్రల్లో నటించారు. సుమారు 250 మిలియన్ డాలర్లు (2250 రూపాయల) వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండడం విశేషం.