Karate Kid: Legends: 'కరాటే కిడ్- లెజెండ్స్' మూవీ రివ్యూ
ABN , Publish Date - May 30 , 2025 | 07:13 PM
'కరాటే కిడ్' ఫ్రాంచైజ్ లో ఆరో సినిమాగా 'కరాటే కిడ్ - లెజెండ్స్' శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ అనువదించారు.
'కరాటే కిడ్' (Karate Kid) ఫ్రాంచైజ్ లో ఆరో సినిమాగా 'కరాటే కిడ్ - లెజెండ్స్' ( Karate Kid: Legends) శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ అనువదించారు. 1984లో ఆరంభమైన 'కరాటే కిడ్' జర్నీ ఇప్పుడు మరోమారు జనాన్ని పలకరించే ప్రయత్నం చేసింది. ఆరంభంలో కరాటే, కుంగ్ ఫూ విద్యలతో సాగిన వీరునిగా రాల్ఫ్ మేక్కియో నటించారు. మొదటి మూడు భాగాల్లో రాల్ఫ్ (Ralph Macchio) కథానాయకుడు కాగా, తరువాత తెరకెక్కిన వాటిలో ఇతరులు హీరోగా అలరించారు. 2010లో రూపొందిన 'కరాటే కిడ్' ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ తనయుడు జేడెన్ స్మిత్ కరాటే కిడ్ గా అలరించాడు. అతనికి కుంగ్ ఫూ నేర్పే మిస్టర్ హాన్ గా జాకీ చాన్ (Jachie Chan) తనదైన యాక్షన్ తో మురిపించాడు. ఇప్పుడు అదే జాకీ చాన్ 'కరాటే కిడ్ - లెజెండ్స్'లో తన మిస్టర్ హాన్ పాత్రను రిపీట్ చేశాడు. ఇక ఆరంభ చిత్రాల్లో హీరోగా మురిపించిన రాల్ఫ్ మేక్కియో ఈ తాజా చిత్రంలో హీరోకి కరాటేలో శిక్షణ ఇచ్చే కోచ్ గా దర్శనమిచ్చాడు. ఇక బెన్ వ్యాంగ్ కరాటే కిడ్ పాత్రలో కనిపించాడు.
ఈ సారి కథ విషయానికి వస్తే - మిస్టర్ హాన్ ఎంతోమందిని మార్షియల్ ఆర్ట్స్ లో ప్రవీణులుగా తీర్చిదిద్దుతూ ఉంటాడు. బీజింగ్, చైనాలో అతని శిక్షణ సాగుతూఉంటుంది. హాన్ మేనల్లుడు లి ఫాంగ్ కూడా శిక్షణ తీసుకుంటాడు. లి ఫాంగ్ అన్నను కొందరు చంపడంతో తల్లి అక్కడ నుండి న్యూయార్క్ కు వెళ్ళవలసి వస్తుంది. అక్కడ స్కూల్ లో, బయట అంతగా లి ఫాంగ్ ఇమడలేక పోతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో లి ఫాంగ్ ఓ టోర్నమెంట్ లో పాల్గొన వలసి వస్తుంది. అందుకు అంకుల్ హాన్ శిక్షణతో పాటు ఆల్ఫ్ మేక్కియో అవసరం కూడా పడుతుంది. వారిద్దరి శిక్షణలో ఆరితేరి కరాటే టోర్నమెంట్ లో పాల్గొంటాడు. చివరకు గెలుస్తాడు.
ఎలా ఉందంటే...
జాకీ చాన్ వయసు మీద పడ్డా తనలో ఫ్లెక్సిబిలిటీ ఉందని నిరూపించుకున్నారు. ఆయన నటన ఎప్పటిలాగే సాగింది. డేనియల్ పాత్రలో రాల్ఫ్ మేక్కియో కూడా ఆకట్టుకుంటాడు. అయితే లి ఫాంగ్ గా నటించిన బెన్ వాంగ్ మాత్రం చక్కటి నటనతో అందరి మది గెలుచుకుంటాడు. సినిమా కథ మనకు ముందే అర్థం అయిపోతుంది. ఎక్కడా ఎలాంటి ట్విస్ట్ లు ఉండవు. దాంతో సినిమా అంత ఆసక్తిగా అనిపించదు. డైరెక్టర్ జొనాథన్ ఎంట్ విస్లే పనితనం ఏ మాత్రం కనిపించదు. ఎప్పుడో 80,90లలో వచ్చిన సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. స్టార్స్ నటించినా సినిమాలో స్పీడ్ అనేది ఉండదు. చక్కటవి యాక్షన్ సినిమాగా తెరకెక్కవలసని ‘కరాటే కిడ్’ బోరుగా బోరుగా సాగుతుంది. గతంలో వచ్చిన 'కరాటే కిడ్' సిరీస్ తో పోలిస్తే ఈ 'కరాటే కిడ్ - లెజెండ్స్'లో ఎక్కడా కొత్తదనం అనేదే కనిపించదు. ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి క్లయిమాక్స్ ఫైట్ మినహా ఏమీ లేదు.
ట్యాగ్ : క'రాడ్డే' కిడ్!
రేటింగ్: 2/5
Also Read: Bhairavam Review: ముగ్గురు హీరోల 'భైరవం' ఎలా ఉందంటే...
Also Read: Shashtipoorthi : షష్టిపూర్తి సినిమా రివ్యూ...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి