Manasulo Maata: ‘మనసులోని మాట’ వినోదాత్మకం..
ABN, Publish Date - Sep 19 , 2025 | 06:56 PM
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఇద్దరు యువకులకు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొని ఎలా ముందుకు సాగారనే కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘మనసులోని మాట’.
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఇద్దరు యువకులకు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొని ఎలా ముందుకు సాగారనే కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘మనసులోని మాట’ (manasulo Maata). అజిత్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పోచంబావి గోపీకృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రమిది. హనుమంతరెడ్డి నిర్మాత. దర్మారెడ్డి, పోచంబావి గోపీకృష్ణ, అధ్యా శర్మ, అబిత్ , మహదేవ్ పార్వతి కీలక పాత్రధారులు. ఈ నెలచచ 25న ఈటీవీ విన్ ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రసాద్ ల్యాబ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. రియల్ ఎస్టేట్ కథకు. వినోదాన్ని జోడించి తెరకెక్కిన చిత్రమిదని దర్శకనిర్మాతలు తెలిపారు.