NTR: ఇదెక్కడి విడ్డూరం.. డిజాస్టర్ మూవీకి ఓటీటీలో రికార్డ్

ABN , Publish Date - Oct 14 , 2025 | 03:12 PM

ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల మైండ్ సెట్ ఏంటో అస్సలు తెలియడం లేదు. థియేటర్ లో ఒక సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే ఇది ప్లాప్.. డిజాస్టర్ అని పెదవి విరుస్తున్నారు.

War 2

NTR: ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల మైండ్ సెట్ ఏంటో అస్సలు తెలియడం లేదు. థియేటర్ లో ఒక సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే ఇది ప్లాప్.. డిజాస్టర్ అని పెదవి విరుస్తున్నారు. ఆ తరువాత అదే సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంటే దానికి బ్రహ్మరధం పడుతున్నారు. తాజాగా థియేటర్ లో డిజాస్టర్ అయిన సినిమా ఓటీటీలో రికార్డ్ సృష్టించింది. ఆ సినిమా ఏంటి అంటే వార్ 2.


మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం వార్ 2. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను YRF బ్యానర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇక ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 15 ఈ సినిమా రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు కానీ, వారిని కూడా వార్ 2 నిరుత్సాహపడేలా చేసింది.


ఇక వార్ 2 ఎట్టకేలకు ఈ మధ్యనే ఓటీటీ బాట పట్టింది. నెట్ ఫ్లిక్స్ లో అక్టోబర్ 9 నుంచి వార్ 2 స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వారం రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలో రికార్డ్ సృష్టించింది. అత్యధిక వీక్షకులు వీక్షించిన సినిమాగా వార్ 2 నిలిచింది. వారం రోజుల్లో 3. 5 మిలియన్ వ్యూస్ సాధించి ఓటీటీ రికార్డ్ ను బద్దలు కొట్టింది. ఓటీటీ స్ట్రీమింగ్ అయిన సినిమాలలో అత్యధిక వ్యూస్ సాధించి టాప్ 1 గా నిలిచింది. ఇక ఇది చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఇదెక్కడి విడ్డూరం.. డిజాస్టర్ సినిమా రికార్డ్స్ సృష్టించడమేంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు.

Suresh Gopi: డబ్బులు సరిపోవట్టేదు...

Aaryan Movie: ఐయామ్ ది గాయ్.. మెలోడీ సాంగ్ అదిరిపోయింది

Updated Date - Oct 14 , 2025 | 03:12 PM