సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Urfi Javed: సర్జరీ వికటించి గుర్తుపట్టలేకుండా మారిన బ్యూటీ

ABN, Publish Date - Jul 21 , 2025 | 07:56 PM

సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ అందం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హీరోయిన్స్ కి.. గ్లామర్ మాత్రమే డబ్బులు తీసుకొచ్చిపెడుతుంది.

Urfi Javed

Urfi Javed: సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ అందం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హీరోయిన్స్ కి.. గ్లామర్ మాత్రమే డబ్బులు తీసుకొచ్చిపెడుతుంది. అందుకే హీరోయిన్స్ ఎప్పుడు కడుపు మాడ్చుకొని వర్క్ అవుట్స్, యోగా అంటూ కష్టపడుతూ ఉంటారు. ఈమధ్యకాలంలో హీరోయిన్స్ మాత్రమే కాదు సోషల్ మీడియాలో అందాలను ఆరబోసే ప్రతి సెలబ్రిటీ కూడా అందం కోసం తెగ కష్టపడుతూ ఉంటారు. కష్టపడి తెచ్చుకున్న అందంతో పాటు..కొనితెచ్చుకుంటున్నారు. అంటే సర్జరీలు చేయించుకొని కొత్త అందాన్ని కొని తెచ్చుకుంటున్నారు.


ఇండస్ట్రీలో హీరోయిన్స్ కు సర్జరీలు కొత్తేమి కాదు. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్, కుర్ర హీరోయిన్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇలా ప్రతి ఒక్కరు సర్జరీలు చేయించుకో.. ముఖానికి కొత్తరూపాన్ని తీసుకొచ్చినవారే. అయితే సర్జరీ సక్సెస్ అయితే ఓకే కానీ, వికటిస్తే వాటి పరిణామాలు తీవ్రతరంగా ఉంటాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇలా సర్జరీలు వికటించి ప్రాణాలు కోల్పోయినవారు కూడా ఉన్నారు.


తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావెద్ గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్యాషన్ సెన్స్ ఎలా ఉండాలో చాలామందిని చూసి నేర్చుకోవచ్చు. ఫ్యాషన్ లో ప్రయోగాలు చేయాలంటే ఉర్ఫీని చూసి నేర్చుకోవాలి. కాదేది డ్రెస్ కు అనర్హం అంటూ.. రకరకాల వస్తువులతో డ్రెస్ లు తయారుచేసి.. మీడియా ముందు తన టాలెంట్ ను చూపిస్తూ ఫేమస్ అయ్యింది. బికినీ దగ్గర నుంచి.. పిన్నీసులు, పేపర్లు, వైర్లు.. ఇలా ఏది వదలకుండా ప్రయోగాలు చేసి ఎప్పటికప్పుడు షాక్ ఇస్తూ ఉంటుంది.


హిందీ బిగ్ బాస్ కి వెళ్లి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఉర్ఫీ.. ఈమధ్యనే కరణ్ జోహార్ హోస్ట్ చేసిన ట్రైటర్స్ రియాలిటీ షో విన్నర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎంతో అందంగా.. అందాల ఆరబోత చేసే ఉర్ఫీ ఇప్పుడు అంద విహీనంగా మారింది. తాజాగా ఉర్ఫీ.. తన లిప్ ఫిల్లర్ సర్జరీ సమయంలో తీసిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. సర్జరీ తరువాత ఉర్ఫీ పెదాలు ఉబ్బిపోయి కనిపించాయి. ఆమెముఖం మొత్తం ఉబ్బిపోయి అంద విహీనంగా మారినట్లు కనిపించింది. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం తాను ఈ లిప్ ఫిల్లర్లు వేయించుకున్నాను అని, అప్పటి పెదాలు.. ఇప్పుడు సెట్ అయ్యినట్లు అయ్యినట్లు చెప్పుకొచ్చింది.


తనలా లిప్ ఫిల్లర్లు వేయించుకోవాలంటే అనుభవం గల డాక్టర్స్ దగ్గరకు వెళ్లాలని, తాను చేసిన తప్పు చేయవద్దని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఉర్ఫీ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అసలు సర్జరీ దేనికి.. న్యాచురల్ గా ఉండొచ్చు కదా అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Pawan Kalyan: ఇండస్ట్రీలో అకీరా ఉండాలంటే.. అది తప్పనిసరి

SJ Suryah: ఏంటి సుధా.. ఇంకా సూర్యకు పెళ్లి కాలేదా

Updated Date - Jul 21 , 2025 | 07:56 PM