Thudarum OTT: స‌డ‌న్‌గా ఓటీటీకి.. కేర‌ళ‌ను షేక్ చేసిన లేటెస్ట్ సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌! ఎందులో.. ఎప్ప‌టి నుంచంటే?

ABN , Publish Date - May 27 , 2025 | 08:13 AM

ఏప్రిల్ లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సంచ‌ల‌న విజ‌యం సాధించి, ఇప్ప‌టికీ థియేట‌ర్లలో క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తున్న చిత్రం తుడ‌రుమ్.

mohanlal

ఏప్రిల్ చివ‌రి వారంలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సంచ‌ల‌న విజ‌యం సాధించి, ఇప్ప‌టికీ థియేట‌ర్లలో క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తున్న చిత్రం తుడ‌రుమ్ (Thudarum). మోహ‌న్‌లాల్ (Mohanlal) హీరోగా వ‌చ్చిన ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.250 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్ట‌గా ఒక్క కేర‌ళ‌లోనే రూ. 100 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్టి కేర‌ళ బాక్సాపీస్‌ను షేక్ చేసింది. ఇప్పుడీ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేందుకు రెడీ అయింది.

అయితే ఈ సినిమా జూన్ మొద‌టి, రెండో వారంలో గానీ ఓటీటీకి రానున్న‌ట్లు కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా స‌డ‌న్‌గా ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించిడం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. మోహ‌న్‌లాల్ స‌ర‌స‌న 38 ఏండ్ల త‌ర్వాత శోభ‌న (Shobana) ఈ చిత్రంలో చేయ‌డం విశేషం. ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో ప్ర‌కాశ్ వ‌ర్మ (Prakash Varma), బినూ ప‌ప్పు (Binu Pappu) న‌టించ‌గా సినిమాకు త‌రుణ్ మూర్తి (Tharun Moorthy) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

Gr35JSQXgAA1ntT.jpeg

క‌థ విష‌యానికి వ‌స్తే.. టాక్సీ డ్రైవర్ షణ్ముఖం (మోహన్ లాల్)ను అందరూ బెంజ్ అని ప్రేమగా పిలుస్తుంటారు. భార్య లలిత శోభన (Sobhana), కొడుకు, కూతురులతో హ్యాపీగా జీవితాన్ని గడుపు తుంటాడు. అతనికి తన పాత అంబాసిడర్ కారంటే ప్రాణం. అలాంటిది ఓ రోజు కుమారుడు త‌న తండ్రికి తెలియ‌కుండా స్నేహితుల‌తో క‌లిసి కారులో బ‌య‌ట‌కు తీస్తారు. తండ్రి ఇది గ‌మ‌నించి వారిని ప‌ట్టుకునే లోగా కారు కాస్త డ్యామేజ్ అవుతుంది.

దీంతో కారును మెకానిక షెడ్‌లో ఇచ్చి కుమారుడిపై చేయి చేసుకుంటాడు. దీంతో అత‌ను కోపంగా ఇంటి నుంచి వెళ్లి రెండు మూడు రోజులైన ఇంటికి రాడు,హ‌స్ట‌ల్‌కు వెళ్ల‌డు. అదే స‌మ‌యంలో బెంజ్ కారులో గంజాయి దొరికింద‌ని దానిని సీజ్ చేస్తారు. పోలీసు అధికారులు టాక్సీ ఇవ్వడానికి నరకం చూపిస్తారు. చివ‌ర‌కు త‌మ‌కు ఓ పని చేసి పెట్టి కారు తీసుకెళ్లొచ్చని చెబుతారు. దాంతో బెంజ్ అయిష్టంగానే వారి పని పూర్తి చేసి కారు తిరిగి ఇంటికి తీసుకు వ‌స్తాడు.

Gr3ptxxWsAAwRHo.jpeg

అది మొద‌లు బెంజ్ జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కొడుకు క‌న‌బ‌డ‌క పోవ‌డంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బెంజ్.. ఆ తర్వాత అతని కదలికలకు సంబంధించిన ఆరా తీసినప్పుడు ఊహించని విషయాలు బయట పడతుంటాయి. ఈ నేప‌థ్యంలో బెంజ్ పోలీసుల‌కు చేసిన ప‌ని వెన‌కాల మిస్ట‌రీ ఏంటీ, అస‌లు పోలీసులు బెంజ్ ను ఎందుకు టార్గెట్ చేశారు? చివ‌ర‌కు బెంజ్ కొడుకు దొరికాడా లేదా అనే స‌ట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్ క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతూ చూసే ప్రేక్ష‌కుల‌ను పాత్ర‌లో పాటే న‌డిచేలా , అంఉలో లీన‌మ‌య‌యేలా చేస్తుంది.

Gr4CrRYXQAAcX5W.png

ఫ‌స్టాఫ్ అర‌గంట సేపు పుల్‌ఫ్యామిలీ రిలేష‌న్స్ పై న‌డిచిన సినిమా ఒక్క సారిగా ఊహించ‌ని మ‌లుపులు తిరుగుతూ మ‌న‌ల్ని సీటులో కూర్చోనియ‌కుండా చేస్తుంది. ఇప్పుడు ఈ సినిమా మ‌రో రెండు రోజుల్లో జియో హాట్‌స్టార్ (Jio Hotstar) ఓటీటీలో మ‌ల‌యాళంతో పాటు తెలుగు ఇత‌ర భాష‌లలోనూ స్ట్రీమింగ్ కు రానుంది. ఎవ‌రైతే థియేట‌ర్ల‌లో మిస్స‌య్యారో, మంచి సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్ చూడానుకునే వారు ఈ సినిమాను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మిస్ అవ‌కుండా చేసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

Updated Date - May 27 , 2025 | 08:18 AM