సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tourist Family - Chhaava: చిన్న సినిమా.. పెద్ద విజయం.. మామూలు రికార్డ్ కాదిది

ABN, Publish Date - Jul 18 , 2025 | 05:56 PM

హిందీ చిత్ర సీమలో ఈ సంవత్సరం సల్మాన్‌ ఖాన్‌ నటించిన ‘సికందర్‌’, అక్షయ్‌ కుమార్‌ నటించిన ‘హౌస్‌ఫుల్‌ 5’ సినిమాలు విడుదల అయ్యాయి. వీటికి మించి విక్కీ కౌశల్‌, రష్మిక మందన్నా జంటగా లక్ష్మణ్‌ ఉటేకర్‌ తెరకెక్కించిన ఛావా కూడా ఈ ఏడాది విడుదలై గొప్ప విజయాన్ని సాధించింది

Tourist Family-Chhaava

ఈ ఏడాది విడుదలై భారీ విజయం అందుకున్న చిత్రాల్లో 'ఛావా' (Chhaava) ఒకటి. దేశం మొత్తం ఇలాంటి చారిత్రాత్మక చిత్రం చూడాలని, నేటి తరానికి శివాజీ మహారాజ్‌, ఆయన తనయుడు శంభాజీ మహారాజ్‌ కథలు తెలియాలని ప్రశంసలతో ముంచెత్తారు. కలెక్షన్ల పరంగానూ ఈ చిత్రం టాప్‌ లెవల్‌కి చేరింది. అయితే ఇప్పుడీ చిత్రం రికార్డ్‌ను ఓ చిన్న సినిమా కొట్టేసింది. నిర్మాణానికి అయిన ఖర్చు కంటే ఎన్నో రెట్లు వసూళ్లు సాధించింది. (Tourist Family)

హిందీ చిత్ర సీమలో ఈ సంవత్సరం సల్మాన్‌ ఖాన్‌ నటించిన ‘సికందర్‌’, అక్షయ్‌ కుమార్‌ నటించిన ‘హౌస్‌ఫుల్‌ 5’ సినిమాలు విడుదల అయ్యాయి. వీటికి మించి విక్కీ కౌశల్‌, రష్మిక మందన్నా జంటగా లక్ష్మణ్‌ ఉటేకర్‌ తెరకెక్కించిన ఛావా కూడా ఈ ఏడాది విడుదలై గొప్ప విజయాన్ని సాధించింది. రూ.90 కోట్లతో రూపొందిన ఈ సినిమా రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లు సొంతం చేసుకున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. (Chhaava collections)

 ALSO READ:
Andhra King Taluka: నువ్వుంటే చాలే.. రామ్ రాసిన పాట విన్నారా

Vijay Devarakonda: స్టంట్స్ చేసింది విజయ్ కాదా..




అయితే ఈ సినిమా కలెక్షన్లను ఓ చిన్న సినిమా బీట్‌ చేసింది. ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకొచ్చి ప్రశంసలు అందుకున్న ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’ లాభాల శాతంలో ఛావా’ ను క్రాస్‌ చేసిందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. రూ.7 కోట్లతో రూపొంది.. చిన్న సినిమాగా విడుదలైంది. కలెక్షన్లలో మాత్రం జోరు చూపించింది. రూ. 90 కోట్లు రాబట్టినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. అంటే దాదాపు పదమూడు రెట్లు ఎక్కువ లాభాలు వచ్చినట్లు చెబుతున్నారు. కథ, నటీనటులు, మేకింగ్‌ విషయంలో రెండు సినిమాలను ఒకదానితో ఒకటి పోలిక ఉండదు. కానీ, నిర్మాణ వ్యయంతో పోలిస్తే మాత్రం అత్యధిక లాభాలు తెచ్చిన ఇండియన్‌ సినిమాగానూ ఈ కుటుంబ కథా చిత్రం రికార్డు సృష్టించింది. ఏప్రిల్‌ 29న విడుదలైన ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’ ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో, ఛావా చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Updated Date - Jul 18 , 2025 | 06:18 PM