The Raja Saab: మేకర్స్ కు షాకిచ్చిన ఆడియో కంపెనీ
ABN , Publish Date - Jun 17 , 2025 | 02:30 PM
హిందీ సినిమాలోని క్లాసికల్ సాంగ్ ను రీమిక్స్ చేద్దామని భావించిన 'ది రాజా సాబ్' టీమ్ ఇప్పుడు తమ ఆలోచనను మార్చుకుందట.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న 'ది రాజా సాబ్' (The Raja Saab) మూవీ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ వివిధ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సోమవారం ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు. ఈ హారర్ కామెడీ మూవీలో రెట్రో ప్రభాస్ కనిపిస్తాడని దర్శకుడు మారుతీ హామీ ఇచ్చారు. భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా 'ది రాజా సాబ్' మూవీని టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
Also Read: VT15: వరుణ్‌తేజ్‌ని యునీక్ లుక్‌లో చూపించే ప్రయత్నం..
'ది రాజా సాబ్' సినిమాలో ప్రభాస్ తో పాటు ముగ్గురు అందాల ముద్దుగుమ్మలు లీడ్ రోల్స్ చేస్తున్నారు. మాళవిక మోహనన్ (Malavika Mohanan) ఈ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అలానే నిధి అగర్వాల్ (Nidhhi Agerwal), రిద్ధి కుమార్ (Riddhi Kumar) సైతం ఇందులో నటిస్తున్నారు. ఇందులో ఉండే నాలుగు పాటలను చిత్రీకరించాల్సి ఉంది. అయితే... ఈ సినిమా కోసం ఓ హిందీ క్లాసికల్ సాంగ్ ను తీసుకుని రీ-మిక్స్ చేయాలని చిత్ర దర్శక, నిర్మాతలు భావించారట. సదరు ఆడియో కంపెనీని అప్రోచ్ అయితే మ్యూజిక్ రైట్స్ ఇవ్వడానికి వాళ్ళు ఏకంగా ఐదు కోట్ల రూపాయలను డిమాండ్ చేశారట. దీంతో మేకర్స్ కు చుక్కలు కనిపించడంతో ఆ సందర్భంలో వచ్చే పాటకు కూడా తమన్ నే స్వరాలు సమకూర్చమని చెప్పాడట. తమన్ ఈ పాటకు ట్యూన్ సిద్థం చేయగానే ఓ భారీ సెట్ లో ఈ పాటను ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ పై చిత్రీకరిస్తారట. బాలెన్స్ వర్క్ ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.
Also Read: Special Ops 2 Trailer: హిమ్మత్ సింగ్ వచ్చేస్తున్నాడు.. గెట్ రెడీ
Also Read: Bollywood: వెండితెరపైకి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బయోపిక్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి