The Family Man Season 3: తివారీ.. మళ్లీ ఫ్యామిలీతో వచ్చేస్తున్నాడు
ABN, Publish Date - Oct 28 , 2025 | 03:41 PM
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ద్వయం రాజ్ అండ్ డీకే (Raj And DK) మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. అమెజాన్ లో టాప్ 1 సిరీస్ గా నిలిచిన ది ఫ్యామిలీ మ్యాన్ (The Family Man) మూడో సీజన్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు చేశారు.
The Family Man Season 3: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ద్వయం రాజ్ అండ్ డీకే (Raj And DK) మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. అమెజాన్ లో టాప్ 1 సిరీస్ గా నిలిచిన ది ఫ్యామిలీ మ్యాన్ (The Family Man) మూడో సీజన్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు చేశారు. బాలీవుడ్ నటుడు మనోజ్ భాజ్ పాయ్ (Manoj Bajpayee) , షరీబ్ హష్మీ, ప్రియమణి కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్ మొదటి సీజన్ 2019 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. శ్రీకాంత్ తివారీ.. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా అద్భుతంగా నటించాడు. ఒకపక్క దేశాన్ని.. ఇంకోపక్క కుటుంబాన్ని బ్యాలెన్స్డ్ గా చూసుకునే ఫ్యామిలీ మ్యాన్ గా మనోజ్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
ఇక మొదటి సీజన్ బాగా హిట్ అవ్వడంతో 2021 లో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ను రిలీజ్ చేశారు. ఇది అంతకు మించి హిట్ అయ్యింది. అందుకు కారణం సమంత ఇందులో ఒక కీలక పాత్రలో నటించడమే. ఈ సిరీస్ లో రాజీగా ఆమె నటనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పొచ్చు. ఈ సిరీస్ వలన సామ్ ఇంట్లో.. చైతో విడాకులు అని రూమర్స్ వచ్చాయి. అందులో నిజం ఎంత అనేది తెలియదు.
ఆ సమయంలోనే రాజ్ తో సామ్ పరిచయం ప్రేమగా మారిందని టాక్. ఇక ఇదంతా పక్కన పెడితే.. ఇప్పుడు ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 తో రాజ్ అండ్ డీకే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పటినుంచో సీజన్ 3 రాబోతుందని ప్రకటించారు కానీ, డేట్ ప్రకటించలేదు. ఇప్పుడు నవంబర్ 21 నుంచి సింహం 3 స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ఒక వీడియో ద్వారా తెలిపారు.
ఇక ఈ వీడియోలో ప్రియమణి, తన పిల్లలు పెద్దవాళ్ళు అయినా.. తన భర్త శ్రీకాంత్ మాత్రం మారలేదని చెప్పుకొచ్చింది. ఇక శ్రీకాంత్ మరో కొత్త మిషన్ కోసం రంగంలోకి దిగినట్లు చూపించారు. ఈసారి కొత్తగా.. అద్భుతంగా ఉండబోతుంది అని మేకర్స్ తెలిపారు. మరి ఈ సిరీస్ లో ఎవరెవరు నటిస్తున్నారు.. సమంత కూడా మళ్లీ కనిపిస్తుందా లేదా అనేది చూడాలి.
Fauzi: యంగ్ ప్రభాస్ గా సుధీర్ బాబు పెద్ద కొడుకు...
Shiva Re-Release: శివనాగేశ్వరరావు చెప్పిన తెర వెనుక విశేషాలు