సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tanushree Dutta: సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌లా చంపే ప్లాన్‌లో..

ABN, Publish Date - Jul 26 , 2025 | 10:24 AM

ఇటీవల తనుశ్రీ దత్తా (Tanushree Dutta) ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన వీడియో ఎంతగా వైరల్‌ అయిందో తెలిసిందే.  సొంత ఇంట్లోనే నాలుగైదు ఏళ్లుగా  వేధింపులకు గురవుతున్నట్లు ఆ వీడియోలో ఆమె చెప్పుకొచ్చారు.

Tanushree Dutta

ఇటీవల తనుశ్రీ దత్తా (Tanushree Dutta) ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన వీడియో ఎంతగా వైరల్‌ అయిందో తెలిసిందే.  సొంత ఇంట్లోనే నాలుగైదు ఏళ్లుగా  వేధింపులకు గురవుతున్నట్లు ఆ వీడియోలో ఆమె చెప్పుకొచ్చారు. ఆ కారణంగా తన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. ‘నేను 2020 నుంచి ఇలాంటి పెద్దపెద్ద సౌండ్‌లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. ఇంటి పైకప్పు, తలుపు బయట నుంచి దాదాపు రోజూ ఇలా పెద్ద పెద్ద చప్పుళ్లతో ఎంతో ఇబ్బంది పడుతున్నాను. నేను బిల్డింగ్‌ మేనేజ్‌మెంట్‌ వాళ్లకు ఫిర్యాదులు చేసి విసిగిపోయాను. ఎలాంటి పరిష్కారం దొరకలేదు’ అంటూ ఆ వీడియోలో ఆవేదన వ్యక్తంచేశారు. తాజాగా మరోసారి ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో వేదింపులపై చేసిన వీడియో వైరల్‌ కావడంతో ఎంతోమంది ఫోన్‌ చేసిన ఇంటర్వ్యూలు అడుగుతున్నారని చెప్పింది. (Meeto)

‘‘కొన్నేళ్లగా నేను ఆధ్యాత్మిక జీవన శైలికి అలవాటు పడటంతో మీడియా నా ముందుకు ఎక్కువగా రావడం లేదు.  ప్రస్తుతం నాకు ఆరోగ్యం బాగాలేదు. అయినా పరిస్థితుల దృష్ట్యా కొద్ది రోజులుగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాను.  నాకూ అందరితో మాట్లాడాలనే ఉంది. దానికి కొంచెం సమయం పడుతుంది.  దయచేసి నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి’ అన్నారు.








‘బాలీవుడ్‌లో మాఫియా ముఠా చాలా పెద్దది. ముంబైలో నా ప్రాణానికి ముప్పు ఉంది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ లాగానే నా ప్రాణం కూడా ప్రమాదంలో ఉంది. ఆయన్ను చంపినట్లుగా నన్ను కూడా చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు’ అని అన్నారు. అవకాశం వస్తే మళ్లీ సినిమాలు చేయాలనుందనే కోరికను ఆమె ఒకప్పుడు బయటపెట్టారు.  

‘ఆశిక్‌ బనాయా ఆపనే’ సినిమాతో ఆమె ఎంతగానో పాపులర్‌ అయ్యారు. అప్పట్లో ఇమ్రాన్‌ హస్మీతో కలిసి నటి తనూశ్రీ దత్తా చేసిన రొమాన్స్‌ ఒక రేంజ్‌ అనే చెప్పాలి. సీరియల్‌ కిస్సర్‌గా ట్యాగ్‌ వేసుకున్న ఇమ్రాన్‌తో ముద్దులతో హద్దులు దాటింది ఆ పాటలో.  2013 తర్వాత ఆమె సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత కరోనా సమయంలో క్యాస్టింగ్‌ కౌచ్‌, మీటూ ఉద్యమం అంటూ గొంతు విప్పి కొంతకాలం వార్తలో నిలిచింది.

Updated Date - Jul 26 , 2025 | 10:24 AM