Tamannaah Bhatia: త్వరలోనే మీరు అతడిని చూస్తారేమో

ABN , Publish Date - Sep 12 , 2025 | 05:45 PM

మిల్కీ బ్యూటీ తమన్నా.. కొన్నాళ్ల ముందు వరకూ విజయ్‌ వర్మతో ప్రేమలో మునిగితేలింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఒకరి గురించి ఒకరు గొప్పలు చెప్పుకున్నారు.

Tamannaah Bhatia


మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah Bhatia).. కొన్నాళ్ల ముందు వరకూ విజయ్‌ వర్మతో (Vijay Varma) ప్రేమలో మునిగితేలింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఒకరి గురించి ఒకరు గొప్పలు చెప్పుకున్నారు. కొంత సమయం తీసుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈలోపే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడం, బ్రేకప్‌ చెప్పుకోవడం జరిగిపోయింది. ఇప్పుడు ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. తాజాగా తమన్నా మాటలు చూస్తే మరోసారి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. తాజాగా మరోసారి తనకు కాబోయే జీవిత భాగస్వామి గురించి స్పందించింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే అతడిని చూస్తారంటూ చెబుతోంది.  

‘మంచి జీవిత భాగస్వామిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను.  ప్రస్తుతం నా తపన అదే. గత జన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే నాకు తమన్నా లాంటి భార్య దొరికిందని, నా జీవిత భాగస్వామి చెప్పుకోవాలి, ఆనందపడాలి. దాని కోసమే నా ప్రయత్నం. అయితే ఆ అదృష్టవంతుడు ఎవరనేది నాకు తెలియదు. త్వరలోనే మీరు అతడిని చూస్తారేమో’ అని తెలిపింది. తాజాగా ఆమె నటించిన వెబ్‌సిరీస్‌ ‘Do you Wanna partner'. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్అ వుతోంది. దీని ప్రమోషన్స్‌లో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. విజయ్‌వర్మతో బ్రేకప్‌ అయిందని చెబుతూనే మరొకరితో రిలేషన్‌లో ఉన్నట్లు ఇన్‌డైరెక్ట్‌గా చెబుతోంది.

READ ALSO: Renu Desai: స్త్రీ స్థానం కేవలం అక్కడే కాదు.. పవన్ ఫ్యాన్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రేణు

Kishkindapuri Review: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హారర్ థ్రిల్లర్ 'కిష్కింధపురి' మెప్పించిందా.. 

Mirai Twitter X Review: తేజ స‌జ్జా.. మిరాయ్ ట్విట్ట‌ర్ రివ్యూ! ఎలా ఉందంటే

Updated Date - Sep 12 , 2025 | 06:38 PM