NTR: షాకింగ్.. శ్రీలీల డ్యాన్సర్ కావడానికి కారణం ఎన్టీఆర్ అంట
ABN , Publish Date - Aug 23 , 2025 | 04:40 PM
టాలీవుడ్ లో ది బెస్ట్ డ్యాన్సర్స్ లో ఎన్టీఆర్ (NTR) ఒకరు. ఇప్పటివరకు అందరూ ఆయన మాస్ డ్యాన్స్, స్పీడ్ డ్యాన్స్ లు మాత్రమే చూసారు.
NTR: టాలీవుడ్ లో ది బెస్ట్ డ్యాన్సర్స్ లో ఎన్టీఆర్ (NTR) ఒకరు. ఇప్పటివరకు అందరూ ఆయన మాస్ డ్యాన్స్, స్పీడ్ డ్యాన్స్ లు మాత్రమే చూసారు. కానీ, ఎన్టీఆర్ ఒక కూచిపూడి డ్యాన్సర్. ఎన్నో వేదికలపై చిన్నతనంలోనే నృత్య ప్రదర్శనలు ఇచ్చి ఎన్నో అవార్డులను కూడా అందుకున్నాడు. అంతేనా ఎంతోమంది డ్యాన్సర్లకు స్ఫూర్తిగా నిలిచాడు. అంతెందుకు ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న శ్రీలీల (Sreeleela) డ్యాన్సర్ అవ్వడానికి కారణం కూడా ఎన్టీఆరే అని తెలుసా..
తాజాగా జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోలో ఈ సంచలన విషయాన్నీ అభిమానులతో పంచుకుంది శ్రీలీల తల్లి స్వర్ణలత. సీనియర్ నటుడు జగపతిబాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో టాక్ షో ఈమధ్యనే మొదలయ్యింది. మొదటి ఎపిసోడ్ కు అక్కినేని నాగార్జున గెస్ట్ గా విచ్చేసి ఎన్నో అద్భుతమైన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఇక రెండో ఎపిసోడ్ కు అందాల భామ శ్రీలీల గెస్ట్ గా విచ్చేసింది. ఇక ఈ షోలో ఆమె చిన్ననాటి విషయాల దగ్గరనుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని విషయాలను జగ్గు బయటకు తీసాడు.
ఇక శ్రీలీల చిన్ననాటి విషయాలను చెప్పడానికి శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణలత కూడా వేదికపైకి వచ్చింది. ఆమె ఈ షోలో ఎన్టీఆర్ తో తనకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది. ఎన్టీఆర్ చిన్నతనంలో కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చిన ఫోటోను జగపతి బాబు చూపించగానే స్వర్ణలత ఆనారి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయింది. తనకు కూతురు పుడితే కచ్చితంగా డ్యాన్సర్ ను చేయాలని నిర్ణయించుకున్న క్షణాలను గుర్తుచేసే ఫోటో అది అని చెప్పుకొచ్చింది. 1997 లాస్ ఏంజెల్స్ లో జరిగిన తానా సభల్లో ఎన్టీఆర్ తో మాట్లాడానని, అనుకున్నట్లే శ్రీలీలకు డ్యాన్స్ నేర్పించినట్లు తెలిపింది. అలా ఎన్టీఆర్ వలనే శ్రీలీల డ్యాన్సర్ అయ్యింది. ప్రస్తుతం శ్రీలీల వరుస సినిమాలతో బిజీగా మారింది.
Swara Bhasker: సమాజంలో చాలా సమస్యలున్నాయి.. వాటిపై దృష్టి పెట్టండి..
Mirai: హనుమాన్ హీరోకు పెద్ద సమస్యే వచ్చి పడిందే