Sreeleela: శ్రీలీలకు.. బాలీవుడ్‌లో ఎదురుదెబ్బ... నిర్మాతలను దోచుకుంటున్నారని కామెంట్లు
ABN , Publish Date - Oct 15 , 2025 | 11:25 AM
ఇటీవల బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ పై అక్కడి సిబ్బంది ఆరోపణలు చేస్తున్నారు. ఆమెతో వర్క్ చేయడం తమ వల్ల కాదని అంటున్నారు. ఆమె ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో ఇరిటేట్ చేస్తున్నారని, పద్థతి మార్చుకోకపోతే ఆమె పేరును బయట పెడతామని చెబుతున్నారు. ఆ హీరోయిన్ శ్రీలీల అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.
తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న శ్రీలీల (Sreeleela) ... పలు కమర్షియల్ ప్రాడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గానూ ఉంది. ఒక వైపు చదువు, మరో వైపు కెరీర్ ను బాలెన్స్ చేస్తూ చాలా కష్టపడుతోంది. ఆమెకు ఏకైక ఆసరా తల్లి మాత్రమే. అయితే చిత్రంగా ఆమె కారణంగానే శ్రీలీలకు చెడ్డపేరు వస్తోందని కొందరు సన్నిహితులు చెబుతున్నారు.
ఇప్పటికే కన్నడ, తెలుగు చిత్రాలలో నటించిన శ్రీలీల 'పరాశక్తి' (Parashakthi) సినిమాతో తమిళ చిత్రసీమలోకి అడుగు పెట్టింది. అలానే ఇటీవల బాలీవుడ్ వైపు దృష్టి సారించింది. అయితే ఇక్కడే ఆమెకు ఎదురు దెబ్బ తగిలింది.
శ్రీలీల వర్క్ చేస్తున్న హిందీ చిత్ర బృందంలోని ఒకరు ఆమెను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. శ్రీలీల పేరును డైరెక్ట్ గా మెన్షన్ చేయకుండా ఓ ప్రముఖ నటి తల్లి కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. 'ఓ నటి సిబ్బంది కారణంగా నేను కొంతకాలంగా హెరాస్ మెంట్ కు గురౌతున్నాను. అన్ ప్రొఫెషనల్ గా వారు బిహేవ్ చేస్తున్నారు.
సౌత్ ఇండియా నుండి వచ్చే వాళ్ళు వారికి ఉచితంగానూ లేదా అతి తక్కువ మొత్తానికి వర్క్ చేస్తారని భావిస్తున్నారు. అదే వేతనం మాకూ ఇవ్వాలని అనుకుంటున్నారు. వాళ్ల కుటుంబంలో ఒకరు ఇరిటేట్ చేస్తుంటారు, మరొకరు సారీ చెబుతుంటారు. వారితో పనిచేయాలని నేను అనుకోవడం లేదు. ముందు సిబ్బంది పేమెంట్ ను వారు బొక్కడం మానేస్తే మంచిది. లేదంటే ఈసారి పేరుతో సహా ఉదహరించాల్సి ఉంటుంది' అని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.
తనకు తెలిసిన ఓ హీరోయిన్ తన సిబ్బంది కోసం మేనేజర్ తో కూడా పోరాడుతుంటుందని, అలాంటి వారి నుండి ఈమె నేర్చుకుంటే బాగుంటుందని సదరు వ్యక్తి సలహా కూడా ఇచ్చారు. శ్రీలీల తల్లి నిర్మాతలు ప్రొవైడ్ చేసే మేకప్ సిబ్బందిని కాకుండా సొంత టీమ్ ను ఏర్పాటు చేసుకుంటారని, వారికి ఆమె చెల్లింపులు చేస్తుంటారని, కానీ నిర్మాతల నుండి అందుకు రెట్టింపు డబ్బులు వసూలు చేస్తారని కొందరు ఆరోపిస్తున్నారు. దాంతో బాలీవుడ్ కు చెందిన సిబ్బంది పెట్టిన పోస్ట్ శ్రీలీల, ఆమె తల్లి గురించే అని కొందరు చెబుతున్నారు.
Also Read: Chiranjeevi Meesaala Pilla: వింటేజ్.. చిరంజీవి బ్యాక్! పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్