Chiranjeevi Meesaala Pilla: వింటేజ్‌.. చిరంజీవి బ్యాక్‌! పండ‌గ చేసుకుంటున్న‌ ఫ్యాన్స్‌

ABN , Publish Date - Oct 15 , 2025 | 06:50 AM

మెగాస్టార్‌ చిరంజీవి, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌ ‘మన శంకర వరప్రసాద్‌గారు’ చిత్రం నుంచి ‘మీసాల పిల్ల’ ఫుల్ సాంగ్ విడుదలైంది. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం, విజువల్ గ్రాండియర్‌తో పాట ఫ్యాన్స్‌లో వైరల్ అవుతోంది. చిరంజీవి స్టైలిష్ స్టెప్పులు వింటేజ్ ఫీల్ ఇచ్చాయి.

chiranjeevi

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’(Mana Shankara Vara Prasad Garu). నయనతార కథానాయికగా నటిస్తున్నారు. వీటీవి గణేశ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. షైన్‌ స్ర్కీన్స్‌, గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్టైమెంట్స్‌ పతాకాలపై సాహు గారపాటి, సుస్మితా కొణిదెల నిర్మిస్తున్నారు. అర్చన సమర్పిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన ప్రచార చిత్రాలు, టైటిల్‌ గ్లింప్స్‌ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

అయితే.. ఇప్ప‌టి నుంచే సినిమా జ‌నంలోకి వెళ్లేలా డైరెక్ట‌ర్‌ అనీల్ చేస్తున్న ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌కు తోటి మేక‌ర్స్‌కు, చూసే వారిని సైతం సంబ్ర‌మ‌శ్చ‌ర్యాల‌కు గురి చేస్తున్నాయి. ప్ర‌తీ సారి ఏదో కొత్త కాన్సెప్ట్‌, కొత్త‌ద‌నం వ‌స్తూ ఆడియ‌న్స్ ను చెడుగుడు ఆడుకుంటు కొద్ది రోజుల పాటు ఆయ‌న మాయ‌లో విహ‌రించేలా చేస్తున్నాడు. ఆ కోవ‌లేనే ఇటీవల విడుదలైన ‘మీసాల పిల్ల’ (Meesaala Pilla) ఫస్ట్‌ సింగిల్ ప్రోమో ప్ర‌జ‌ల్లోకి బాగా వెళ్లింది. మాములుగా పాట‌లు విడుద‌ల‌య్యాక అనేక మంది ఆ పాట‌ను రీ క్రియేట్ చేయ‌డం చూస్తుంటాం. కానీ ఈపాట‌కు అందుకు భిన్నంగా ప్రోమోకు సైతం జ‌నం రీల్స్, రీ క్రియేష‌న్లు చేశారంటే ఈ సాంగ్ ప్ర‌జ‌ల్లోకి ఎంత‌లా వెళ్లిందో అర్థ‌మ‌వుతుంది.

అయితే ప్రోమోతోనే అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్న ఈ పూర్తి పాటను మేకర్స్ మంగళవారం విడుదల చేశారు. పాట అలా వ‌చ్చిందే త‌డువు ఆ మ‌రుక్ష‌ణం నుంచే ప‌బ్లిక్ త‌మ టాలెంట్ చూపించ‌డం మొద‌లు పెట్టారు. వ‌య‌స్సుకు సంబంధం లేకుండా ప్ర‌తి ఒక్క‌రూ రీల్స్ తో చెల‌రేగి పోతున్నారు. పాట కూడా క్యాచీ గా ఉండ‌డం కూడా బాగా క‌లిసి వ‌చ్చింది. ఇందులో మెగాస్టార్‌ వేసిన స్టైలిష్‌ స్టెప్పులు వింటేజ్‌ చిరును గుర్తుకు తెస్తున్నాయంటూ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. విజువల్స్‌ ఆకట్టుకున్నాయి. లీడ్‌ పెయిర్‌ మధ్య కెమిస్ట్రీ ప్రధానాకర్షణగా నిలిచింది.

విజయ్‌ పొలాకి ఈ పాట‌కు కొరియోగ్రఫీ అందించగా, భాస్కరభట్ల సాహిత్యం అందించారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించారు. ఉదిత్‌ నారాయణ్‌, శ్వేతా మోహన్‌ ఆలపించారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: తమ్మిరాజు, డీఓపీ: సమీర్‌ రెడ్డి. కాగా సినిమా జ‌న‌వ‌రి 14న ప్రేఓకుల ఎదుట‌కు రానుంది.

Updated Date - Oct 15 , 2025 | 07:04 AM