Gopi Galla Goa Trip: గోవాకు వస్తే.. గర్ల్‌ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్! ఏమీ అయితలే.. ట్రైలర్ భలే ఉంది
ABN , Publish Date - Oct 15 , 2025 | 07:44 AM
గతంలో అంతా కొత్త వాళ్లతో రూపొందిన ఈ నగరానికి ఏమైంది, హుషారు చిత్రాల మాదిరి ఓకొత్త చిత్రం తయారైంది.
గతంలో అంతా కొత్త వాళ్లతో రూపొంది అనామకంగా వచ్చి మంచి విజయం సాధించి కల్ట్ సినిమాల్లో చేరిన ఈ నగరానికి ఏమైంది, హుషారు చిత్రాల మాదిరి ఓకొత్త చిత్రం తయారైంది. అదే గోపి గాళ్ల గోవా ట్రిప్ (Gopi Galla Goa Trip ). ఈ మూవీని అంతా కొత్త ముఃఖాలే రూపొందించగా థీమ్ సైతం ఆ సినిమాలదే కావడం గమనార్హం.
అయితే స్క్రీన్ ప్లే, నటుల అమాయకత్వం, సంగీతం అంతా కొత్తగా ఉండి అంతకుముందు వచ్చిన చిత్రాలకు కొనసాగింపుగా కాకుండా వాటికి భిన్నంగా ఇంట్రెస్టింగ్ ఉంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తుంటే ఇట్టే యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ఉంది.
ఓ మారుమూల పల్లెకు చెందిన అనామక కుర్రాళ్లు ఇద్దరు తాము అప్పటివరకు గోవా గురించి విన్న మాటలను దీష్టిలో పెట్టుకుని అక్కడికి వెల్లి ఎంజాయ్ చేయాలని నిశ్చయించుకుంటారు. గర్ల్‌ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్ కోసం అని అక్కడికి వెళ్లిన వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, ఏం చేశారనేది కథ.
ఈ క్రమంలో గోవాలో ఎక్కడకు వెళ్లాలో, ఎటు వెళ్లాలో గజిబిజి ఉండడం వారికి ఒకరి సాయం దొరకడం ఈ నేపథ్యంలో సినిమాలో వచ్చే సన్నివేశాలు, డైలాగ్స్ మన కాలేజీ రోజులను గుర్తు చేసేలా ఉన్నాయి. వీలుంటే మీరూ ఓ లుక్కేయండి. యూత్‌కి గనక ఇది రీచ్ అయితే సినిమా హిట్ అవడం ఖాయమనేలా ఉంది.
అజిత్ మోహన్, రాజు శివరాత్రి, క్యాంప్ శశి, సాయి కుమార్, రమేశ్, మోనికి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రోహిత్ పెన్‌మత్స (Rohit Penumatsa) దర్శకత్వం వహించాడు. రవి నిడమర్తి (Ravi Nidamarthy) సంగీతం అందించాడు. నవంబర్ 14న థియేటర్లలో విడుదల కానుంది.