Dharamendra: ధర్మేంద్రకు వినూత్న నివాళి
ABN, Publish Date - Nov 28 , 2025 | 05:48 PM
సంస్మరణ సభ అంటే కేవలం కన్నీళ్ళు, నిటూర్పులేనా! కాదు అని నిరూపించబోతోంది ధర్మేంద్ర కుటుంబం. లెజండరీ యాక్ట్రర్ సంస్మరణ దినాన్ని వినూత్నంగా జరుపుకోవాలని వారి కుటుంబం భావిస్తోంది. దాన్ని లైఫ్ టైమ్ మెమొరీగా చేయాలని ప్రయత్నిస్తోంది.
బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర మరణం తాలూకు బాధ నుండి ఆయన అభిమానులు ఇంకా కోలుకోలేదు. ఆయన సినిమాలను, నటనను గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ధర్మేంద్ర జ్ణాపకాలు కలకాలం నిలిచిపోయేలా ఆయన సంస్మరణ సభను ఆయన కుటుంబం నిర్వహించాలని అనుకుంటోంది. ‘సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్’ పేరుతో ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని సాధారణ శ్రద్ధాంజలి సభలా కాకుండా… భావోద్వేగ క్షణాలు, గుండె తడిమే జ్ఞాపకాలతో పాటు ఆనందం నింపే ఒక భారీ సంబరంగా నిర్వహించాలని ధర్మేంద్ర కుటుంబం అనుకుంటోంది. ధర్మేంద్ర సినిమాలు, డైలాగులు, డాన్సులు, పాటల ద్వారా పంచిన సంతోషాన్ని… ఆ కార్యక్రమంలో గుర్తు చేసుకుంటూ జరుపుకోవాలని డిసైడ్ చేశారు. ఈ ఈవెంట్‌లో మరో హైలైట్ కూడా ఉండబోతోంది.
ధర్మేంద్రకు ఇష్టమైన టైమ్‌లెస్ గోల్డెన్ సాంగ్స్ ను ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ లైవ్‌లో ఆలపించనున్నారు. గుండె కరిగించే పాటలతో పాటు పెదాలపై చిరునవ్వులు పూయించేవి కూడా ఇందులో ఉండబోతున్నాయి. ఇలా ధర్మేంద్ర స్నేహితులు, కో-స్టార్స్, వేలాదిమంది అభిమానులు ఒక్కచోట చేరి… ఆ మహానటుడి గ్రాండ్ లెగసీని, ఆయన సృష్టించిన ఎన్నో జ్ఞాపకాలను సంతోషంగా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు.
Read Also: Dil Raju: దిల్ రాజుకు గోల్డెన్ డీల్
Read Also: Karthi: ఆసక్తికరంగా ‘అన్నగారు వస్తారు’ టీజర్