Dil Raju: దిల్ రాజుకు గోల్డెన్ డీల్.. సంక్రాంతి కింగ్ మరోసారి చక్రం తిప్పబోతున్నాడా?

ABN , Publish Date - Nov 28 , 2025 | 05:42 PM

ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరోసారి సంక్రాంతి కింగ్ గా మారబోతున్నాడా? పాత అప్పులన్నీ తీరే జాక్ పాట్ ఆయనకు తగిలిందా? అంటే అవుననే అంటోంది టాలీవుడ్. మోస్ట్ అవెయిటెడ్ మూవీ దిల్ రాజు ఖాతాలోనే చేరడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ గా మారింది.

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రవిపూడి కాంబినేషన్‌లో వస్తోన్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ హైప్ ను క్రియేట్ చేసింది. ఇటీవల విడుదలైన ‘మీసాల పిల్ల’ పాట మరింత బజ్ ను తీసుకువచ్చింది. 2026 సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమా బిజినెస్ అప్పుడే మొదలైంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ బిజినెస్ నంబర్స్ బయటకు వచ్చాయి.


'మన శంకర వరప్రసాద్ గారు' నిజాం రైట్స్‌ను నిర్మాత దిల్ రాజు రూ. 32 కోట్లకు కొనుగోలు చేశాడట. ఇది ఆయనకు మంచి లాభాలు తెచ్చిపెట్టే అవకాశముందని ట్రేడ్ పండిట్స్ అంచనా వేస్తున్నారు. సంక్రాంతి అంటేనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి బిగ్ సీజన్. ఫ్యామిలీ ఆడియన్స్ భారీ సంఖ్యలో థియేటర్లకు వస్తారు. మెగాస్టార్ చిరంజీవి తన రీ-ఎంట్రీ తర్వాత సంక్రాంతికి ‘ఖైదీ నంబర్ 150’, ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్‌ బస్టర్లు ఇచ్చారు. అలాగే డైరెక్టర్ అనిల్ రవిపూడికి కూడా సంక్రాంతి గోల్డెన్ సీజన్... ‘ఎఫ్ 2’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి సూపర్ హిట్స్ ఇచ్చాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రవిపూడి ఫస్ట్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ 2026 సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.

'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమాలో వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మౌత్ టాక్ వస్తే నిజాంలో ఈ సినిమా రూ. 40 కోట్ల షేర్ వసూలు చేయడం అస్సలు కష్టమే కాదు. అయితే వచ్చే సంక్రాంతికి ఈ సినిమాతో పాటు మరో పాన్ ఇండియా బిగ్గీ ‘ద రాజా సాబ్’ సహా పలు సినిమాలు వస్తున్నాయి. కాబట్టి స్క్రీన్ కౌంట్ సైతం ఇందులో కీలక పాత్ర పోషించబోతోంది. ఆల్రెడీ దిల్ రాజే నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ సినిమా రైట్స్ కూడా సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం కొంచెం డౌన్ ఫేజ్‌లో ఉన్న దిల్ రాజుకి ఈ రెండు సినిమాలు జాక్‌పాట్ డీల్స్‌ కాబోతున్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Read Also:Tollywood: అంగరంగ వైభవంగా సావిత్రి మహోత్సవ్

Read Also: Pelli Chesukundam: వెంకటేశ్‌..'పెళ్ళి చేసుకుందాం'.. రీ-రిలీజ్

Updated Date - Nov 28 , 2025 | 05:54 PM