Sonakshi Sinha: వెబ్‌సైట్స్‌ కు సోనాక్షి మాస్ వార్నింగ్

ABN , Publish Date - Sep 03 , 2025 | 06:22 PM

కాసింత జ‌రగమంటే... ఇల్లంతా నాదే అన్నడ‌ట వెనకటికొకరు. కొన్ని బ్రాండెడ్ కంపెనీల తీరు అలాగే ఉందని బీటౌన్ బ్యూటీ సోనాక్షి సిన్హా ఫైర్ అవుతోంది. కాస్త హెల్ప్ చేస్తే త‌న బ్రాండ్‌కే ఎస‌రుపెడుతున్నార‌ని మండిపడుతోంది. అంతేకాదు సదరు కంపెనీల‌కు వార్నింగ్ కూడా ఇచ్చింది.

బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) కు కోపం వచ్చింది. అందుకే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్ ఇండ‌స్ట్రీలో బిగ్ డిబేట్‌గా మారింది. కొన్ని ఆన్‌లైన్ షాపింగ్ బ్రాండ్స్ తన అనుమతి లేకుండా, రైట్స్ తీసుకోకుండా తన ఫోటోలు వాడుకున్నాయంటూ ఆరోపించడం చ‌ర్చకు దారితీసింది. ఇది స‌రైన విధానం కాద‌ని... కంపెనీలు తదుప‌రి ప‌రిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని హెచ్చరించింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఫ్యాన్స్ తో పాటు సెల‌బ్రెటీలు సోనాక్షిని సపోర్ట్ చేస్తున్నారు.


ఆన్‌లైన్ షాపింగ్ చేయ‌డం సోనాక్షికి చాలా ఇష్టం. అలా ఈ బ్యూటీ షాపింగ్ చేసిన‌ప్పుడ‌ల్లా ఆయా వ‌స్తువుల‌ను కొనుగోలు చేసిన కంపెనీల‌కు క్రెడిట్ ఇస్తుంటుంది. అయితే ఇదే అద‌నుగా కొన్ని బ్రాండ్‌లు ముద్దుగుమ్మ ఫోటోల‌ను వాడ‌టం మొద‌లుపెట్టాయి. సోనాక్షి త‌మ ఉత్పత్తుల‌ను వాడుతోంద‌ని ప్రమోట్ చేసుకుంటున్నాయి. అయితే ఇదంతా తన అనుమ‌తి లేకుండా పెట్టడంపై బ్యూటీ తీవ్రంగా మండిప‌డుతోంది. వెంటనే ఈ ఫోటోలు తీసేయాల‌ని లేదంటే.. నోటీసులు పంపుతాన‌ని వార్నింగ్ ఇచ్చింది.

సోనాక్షి చేసిన ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారింది. మ‌రికొంద‌రు సెలబ్రెటీలు అందాల భామకు మ‌ద్దతుగా గొంతు క‌లిపారు. మ‌రో హీరోయిన్ ట‌బు (Tabu) కూడా తాను అలాంటి బాధితురాలినేన‌ని చెప్పుకొచ్చింది. ఇలాంటి వాటికి అడ్డుక‌ట్టప‌డాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని మ‌రికొంద‌రు కూడా సోనాక్షికి మద్దత్తు పలికారు. మ‌రోవైపు ఈ చిన్నదాని ఫోటో వాడిన బ్రాండ్స్ ఇప్పటి వరకు స్పందించలేదు. మ‌రి వారు ఫోటోలు డిలీట్ చేస్తారా.. తదుపరి ప‌రిణామాల‌ను ఎదుర్కొంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.

Reas Also: AR Murugadoss: మదరాసి అయినా మురుగాను ఆదుకుంటుందా

Reas Also: Balakrishna: 'అఖండ -2' వాయిదా! థమన్‌కు.. కలిసొచ్చిన నిర్ణయం

Updated Date - Sep 03 , 2025 | 06:36 PM