AR Murugadoss: మదరాసి అయినా మురుగాను ఆదుకుంటుందా
ABN , Publish Date - Sep 03 , 2025 | 05:56 PM
కోలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
AR Murugadoss: కోలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో గజిని, తుపాకి, కత్తి లాంటి సినిమాలకు దర్శకత్వం వహించి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక తమిళ్ వారికి అన్ని మంచి హిట్స్ ఇచ్చిన మురుగా.. తెలుగువారికి మాత్రం స్పైడర్ లాంటి డిజాస్టర్ ను అందించాడు. అందుకే తెలుగు ప్రేక్షకులకు మురుగా అంటే కొద్దిగా కోపం. ఇక గత కొంతకాలంగా మురుగదాస్ ఒక మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాల తీసినా ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు.
ప్రస్తుతం మురుగదాస్ ఆశలన్నీ మదరాసిపైనే పెట్టుకున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ హీరోగా మురుగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మదరాసి. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. సెప్టెంబర్ 5 న మదరాసి అన్ని భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ఇంకా రెండు రోజుల్లో రిలీజ్ కానుంది అయినా తెలుగులో బజ్ లేదు. శివకార్తికేయన్.. తెలుగువారికి సుపరిచితుడే. అమరన్ సినిమాతో హిట్ కొట్టి మంచి జోష్ మీద కూడా ఉన్నాడు. అయినా కూడా తెలుగువారు ఈ సినిమా గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. అందుకు కారణం కూడా మురుగానే.
సినిమా హిట్ అయితే తన గొప్పతనం.. ప్లాప్ అయితే హీరో చెప్పిన మాట వినలేదని మురుగా చేసిన ఆరోపణలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. హిందీలో సల్మాన్ ఖాన్ తో సికిందర్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఐఐటీ సికిందర్ డిజాస్టర్ తన తప్పు కాదని, సల్మాన్ తప్పని బహిరంగంగా హీరోపై నిందలు వేశాడు. కానీ, సోషల్ మీడియాలో అందరూ మురుగానే విమర్శించారు. ఇక ఇక్కడితో ఆగాడా .. అంటే ఈ మధ్యనే భాషాభిమానం చూపించాడు. తమిళ్ డైరెక్టర్స్ జ్ఞానం ఇవ్వడానికి చూస్తారని, అందుకే తమవద్ద వెయ్యి కోట్ల గ్రాసర్ లేవని చెప్పాడు. ఇక ఈ ఒక్క మాట ప్రేక్షకులను బాగా హర్ట్ చేసింది.
ఇలా మురుగా ఒకదాని తరువాత ఒకటి వివాదంగా మార్చుకుంటూ వస్తున్నాడు. వివాదాలు పక్కన పెడితే కథ బావుంటే మిగతా ప్రేక్షకులు ఎలా ఉన్నా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మదరాసి ట్రైలర్ చూసాక చాలామంది రొటీన్ లానే ఉంది అని పెదవి విరిచారు. రొటీన్ కథ అయితే శివకార్తికేయన్ ఒప్పుకోడు కదా.. ఏదైనా ట్విస్ట్ లు ఉన్నాయేమో అని కొందరు చెప్పుకొస్తున్నారు. ఇక అదే రోజున ఘాటీ రిలీజ్ కు సిద్దమవుతుంది. దాంతో పోటీ పడి మదరాసి ఒక మోస్తారు కలక్షన్స్ అయినా రాబడుతుందా.. మురుగాను ఈ సినిమా అయినా ఆదుకుంటుందా అనేది చూడాలి.
Kalyani Priyadarsan: 'లోక' సరికొత్త రికార్డ్...
Allu Sirish: హిట్ కోసం రూట్ మార్చిన అల్లు వారబ్బాయి