Diamond Raja: వ‌రుణ్ సందేశ్ డైమండ్ రాజా నుంచి.. హే రాజా హే రాజా సాంగ్‌

ABN , Publish Date - Jul 15 , 2025 | 06:47 PM

వ‌రుణ్ సందేశ్ (Varun Sandesh) హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం డైమండ్ రాజా.

Diamond Raja

వ‌రుణ్ సందేశ్ (Varun Sandesh) హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం డైమండ్ రాజా (Diamond Raja). డాలీషా (Dollysha), నందిని రాయ్ (Nandini Rai)హీరోయిన్లుగా న‌టిస్తోండ‌గా పోసాని కృష్ణ‌ముర‌ళి, స‌త్యం రాజేశ్‌, ష‌క‌ల‌క శంక‌ర్, ఫృథ్వీ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. గున్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి (Srinivas Gundreddy) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా నుంచి హే రాజా హే రాజా (Hey Raja Hey Raja) అంటూ ఓ మాస్ మ‌సాలా పాట‌ను విడుద‌ల చేశారు. రాంబాబు గోసాల (Rambabu Gosala)సాహిత్యం అందించగా స్వీయ సంగీతంలో అచ్చు రాజ‌మ‌ణి (Achu Rajamani), వ‌య‌కామ్ విజ‌య‌ల‌క్ష్మి (Vaikom Vijayalakshmi) ఆల‌న‌పించారు. పాట ప‌దే ప‌దే, విన‌డానికి హ‌మ్ చేసుకునేలానే ఉంది.

Updated Date - Jul 15 , 2025 | 06:47 PM