Don 3: అప్పుడు హీరోగా ఇప్పుడు గెస్ట్ గా...
ABN, Publish Date - Jul 08 , 2025 | 11:56 AM
బాలీవుడ్ బాద్ షా, స్టార్ హీరో రణవీర్ సింగ్ ఇంతవరకూ కలిసి ఏ సినిమాలోనూ నటించలేదు. ఇప్పుడు ఆ ఇద్దరూ స్క్రీన్ ను షేర్ చేసుకోబోతున్నారనే వార్త అభిమానులలో కొత్త జోష్ ను నింపింది.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కెరీర్ లో 'డాన్' (Don) సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. 1978లో అమితాబ్ బచ్చన్ (Amithabh Bachchan) నటించిన 'డాన్'ను షారుఖ్ ఖాన్ మరోసారి వెండితెరపై చేసి మెప్పించాడు. ఫర్హాన్ అక్తర్ (Farhan Akhtar) దర్శకత్వం వహించిన ఈ సినిమా 2006లో విడుదలై ఘన విజయం సాధించింది.
విశేషం ఏమంటే.. 2011లో 'డాన్'కు సీక్వెల్ గా 'డాన్ 2' (Don 2) కూడా వచ్చింది. అయితే ఆ తర్వాత డాన్ కు మరో సీక్వెల్ తీయాలనే కోరిక ఫర్హాన్ అక్తర్ లో కలిగింది. కానీ ఈ సారి షారుఖ్ ఖాన్ కు కాకుండా ఆయన హీరోగా రణవీర్ సింగ్ (Ranveer singh) ను ఎంపిక చేసుకున్నాడు. 'డాన్' మొదటి రెండు భాగాల్లోనూ రోమా పాత్రను పోషించిన ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఇందులోనూ నటిస్తుందని తెలుస్తోంది. 'డాన్, డాన్ 2' హీరోగా నటించిన షారుఖ్ ఖాన్ ను ఇందులో అతిథి పాత్ర పోషించమని ఫర్హన్ అక్తర్ కోరాడట. ఆయన కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కోలీవుడ్ సమాచారం. అదే నిజమైతే... రణవీర్ సింగ్, షారుఖ్ ఖాన్ కలిసి స్క్రీన్ ను షేర్ చేసుకునే మొదటి సినిమా 'డాన్ 3' నే అవుతుంది. మరి అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ వంటి ఉద్దండులు పోషించిన డాన్ పాత్రకు రణవీర్ సింగ్ ఎలాంటి న్యాయం చేకూర్చుతాడో చూడాలి.
Also Read: The 100: ఆర్.కె. సాగర్ అండ్ టీమ్ తో స్పెషల్ చిట్ చాట్
Also Read: Son Of Sardaar 2: ఆకట్టుకుంటున్న పాట...