Son Of Sardaar 2: ఆకట్టుకుంటున్న పాట...

ABN , Publish Date - Jul 08 , 2025 | 11:04 AM

అజయ్ దేవ్ గన్ నటించిన 'సన్ ఆఫ్ సర్దార్' మూవీ 2012లో విడుదలై వినోదాల విందును అందించింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా 'సన్ ఆఫ్ సర్దార్ -2' జనం ముందుకు రాబోతోంది.

అజయ్ దేవ్ గన్ (Ajay Devgn) , మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటిస్తున్న సినిమా 'సన్ ఆఫ్ సర్దార్ -2' (Son of Sardaar -2). విజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కామెడీ మూవీ ఇదే నెల 25న జనం ముందుకు రాబోతోంది. దాంతో ప్రచార కార్యక్రమాల జోరు పెంచిన మేకర్స్ తాజాగా ఇందులోని 'పెహలా తూ దుజా తూ' అనే పాటను విడుదల చేశారు. ఇందులో అజయ్ దేవ్ గన్, మృణాల్ జోడీ ఆకట్టుకునేలా ఉంది. ఈ పాటను విశాల్ మిశ్రా పాడారు.


ఈ సినిమాలో ముందు అనుకున్న విధంగా సంజయ్ దత్ నటించాల్సి ఉంది. అయితే యు.కె. పాస్ పోర్ట్ ఆయనకు సకాలంలో రాకపోవడంతో ఆయన స్థానంలో రవికిషన్ ను తీసుకున్నారు. ఇతర కీలక పాత్రలను సంజయ్ మిశ్రా, విందు దారాసింగ్, స్వర్గీయ ముకుల్ దేవ్, శరత్ సక్సేనా, నీరు బజ్వా, దీపక్ డోబ్రియాల్ తదితరులు పోషించారు. అజయ్ దేవ్ గన్ తో పాటు జ్యోతి దేశ్ పాండే ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. మరి 2012లో వచ్చిన 'సన్ ఆఫ్‌ సర్దార్' స్థాయి విజయాన్ని ఈ సీక్వెల్ అందుకుంటుందో లేదో చూడాలి.

Updated Date - Jul 08 , 2025 | 11:28 AM