War 2: సలామ్ అనాలి… అందుకేగా వెయిట్ చేస్తోంది…
ABN , Publish Date - Aug 06 , 2025 | 07:07 PM
దేశమంతా ఎదురుచూస్తున్న సినిమాల్లో వార్ 2 (War 2) ఒకటి. హృతిక్ రోషన్ (Hrithik Roshan), ఎన్టీఆర్ (NTR) మల్టీస్టారర్ గా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వార్ 2.
War 2: దేశమంతా ఎదురుచూస్తున్న సినిమాల్లో వార్ 2 (War 2) ఒకటి. హృతిక్ రోషన్ (Hrithik Roshan), ఎన్టీఆర్ (NTR) మల్టీస్టారర్ గా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వార్ 2. YRF స్పై యూనివర్స్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఆగస్టు 14 న రిలీజ్ కు రెడీ అవువుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ వరుసగా సినిమాలోని ప్రమోషనల్ కంటెంట్ ను వదులుతున్నారు.
ఇప్పటికే బాలీవుడ్ మొత్తం హృతిక్ రోషన్ తన చేతుల్లోకి తీసేసుకున్నాడు. ఎక్కడ చూసినా హృతిక్ నే కనిపిసున్నాడు. అయితే ఇప్పటివరకు వార్ 2 ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ అడుగుపెట్టలేదు. తెలుగువారందరూ ఈ సినిమాను ఎన్టీఆర్ కోసమే చూస్తున్నారు. తారక్ ఇంకా ప్రమోషన్ మొదలుపెట్టకపోయేసరికి కొత్త అనుమానాలను దారితీస్తున్నాయి. దీంతో మేకర్స్ కొత్తగా ఆలోచించి వార్ 2 లో వీరిద్దరూ కలిసి నటించిన సాంగ్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. వార్ 2 మొదలైనప్పటినుంచి హృతిక్ - ఎన్టీఆర్ మధ్య ఒక సాంగ్ ఉంటుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. దీని కోసం వీరిద్దరూ చాలా కష్టపడ్డారని కూడా చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా ఇద్దరు డైనమిక్ డ్యాన్సర్లు ఒకే స్క్రీన్ పై కనిపించడంతో అభిమానులు ఈ సాంగ్ ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా అని ఎదురుచూసారు. ఎట్టకేలకు ఆ సమయం రానేవచ్చింది. సలామ్ అనాలి అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమోను రేపు రిలీజ్ చేయనునంట్లు మేకర్స్ ప్రకటించారు. వైట్ అండ్ వైట్ డ్రెస్ లలో హృతిక్, తారక్ నడుచుకుంటూ వస్తున్న ఒక పోస్టర్ ను రిలీజ్ చేస్తూ.. వార్ మొదలైంది. ఇద్దరు డైనమిక్ డ్యాన్సర్లు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ తమ అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధమయ్యారు అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సాంగ్ కోసమే కదా ఎదురుచూస్తుంది.. రేపు రచ్చ రచ్చ అవ్వాలి అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సాంగ్ రేపు ఎన్ని రికార్డులు బద్దలు కానుందో చూడాలి.
120 Bahadur Teaser: దేశభక్తిని రగిలించేలా '120 బహదూర్' టీజర్
Ghaati Trailer: సీతమ్మోరు లంకాదహనం చేస్తే ఇట్టాగే ఉండేదేమో