Saif ali Khan Case: సైఫ్ కత్తి పోటు కేసు.. బెయిల్ వద్దంటూ.. నిందితుడు
ABN , Publish Date - May 10 , 2025 | 12:26 PM
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై (Saif ali khan) కత్తితో దాడి (Saif ali khan attack) జరిగిన సంగతి తెలిసిందే! జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై (Saif ali khan) కత్తితో దాడి (Saif ali khan attack) జరిగిన సంగతి తెలిసిందే! జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. అతని మెడపై కత్తిపోట్లు కూడా పడ్డాయి. దీంతో ఆస్పత్రిలో అత్యవసర శస్త్రచికిత్స తీసుకున్న ఆయన సుమారు ఐదు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే అతడు సైఫ్ నివాసంలోకి వెళ్లాడని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను(30) అరెస్ట్ చేశారు. ఇప్పటికే అతనిపై కోర్టులో చార్జ్‌షీట్‌ను కూడా దాఖలు చేశారు.
అయితే, తన అరెస్ట్ చట్టవిరుద్థమని ప్రకటించాలని, తనను జైలు నుంచి విడుదల చేయాలని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌ను కోర్టును నిందితుడు ఆశ్రయించాడు. ఆపై ఏప్రిల్ నెలలో సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కూడా అతను క్యాన్సిల్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న నిందితుడు మొహమ్మద్ తన న్యాయవాది అజయ్ గావ్లి ద్వారా, తన అరెస్టును చట్టవిరుద్థమని ప్రకటించాలని కోరుతూ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ముందు అప్పీలు చేసుకున్నాడు. ఆపై తనను జైలు నుంచి విడుదల చేయాలని కోరాడు. ఆ పిటిషన్‌లో, పోలీసులు తనను అరెస్టు చేసేటప్పుడు నిబంధనలను పాటించలేదని, వారిపై మరికొన్ని ఆరోపణలు చేశాడు. దీంతో వాటికి వివరణ ఇవ్వాలని కోర్టు పోలీసులను కోరింది. మే 13కి విచారణను వాయిదా వేసింది.
READ ALSO: Aarti Ravi: నాన్న.. అంటే టైటిల్ కాదు.. అదొక బాధ్యత
Celina Jaitly: నా సైనికులు పేరు, మతం అడగకుండానే రక్షిస్తారు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి