Celina Jaitly: నా సైనికులు పేరు, మతం అడగకుండానే రక్షిస్తారు
ABN , Publish Date - May 10 , 2025 | 12:08 PM
ఆస్ట్రేలియా లో ఉంటోన్న సెలీనాజైట్లీ (Celina Jaitly) భారత సాయుధ దళాలను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టారు.
ఆస్ట్రేలియా లో ఉంటోన్న సెలీనాజైట్లీ (Celina Jaitly) భారత సాయుధ దళాలను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టారు. ఉగ్రవాదానికి (terrarists) తాను ఎప్పుడూ వ్యతిరేకి నేనని అన్నారు. దీంతో కొందరు ఆమెను ట్రోల్స్ చేయడం మొదటుపెట్టారు. భారత్ (India) ప్రశంసిస్తే తనను అన్‌ఫాలో చేస్తామని బెదిరించారు. ఈ ట్రోల్స్‌పై ఆమె స్పందించారు. దేశాన్ని రక్షించడం కోసం సైనికులు చేస్తున్న పోరాటాలను ప్రశంసించారు. కోట్లమంది ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారంటే అదంతా సైనికుల (Indian Solidiers) త్యాగమేనని చెప్పారు. ఆమె మాట్లాడుతూ "భారత్ గురించి పాజిటివ్‌గా మాట్లాడితే కొందరు నన్ను అన్‌ఫాలో చేస్తామని అంటున్నారు. అలా బెదిరించేవారి కోసమే ఈ పోస్ట్ పెడుతున్నాను. నా దేశం కోసం నిలబడినందుకు నేను ఎప్పటికీ క్షమాపణలు చెప్పను. (Indian Army)
ఉగ్రవాదం పేరుతో అమాయకుల ప్రాణాలు తీస్తున్నా కూడా నేను స్పందించకుండా నోరు మూసుకుని ఉండలేను. ఎంతోమంది అమాయకుల ప్రాణాలు తీశారు. హింసను సమర్థిస్తూ.. దాన్ని పోత్సహించే వారివైపు నేను ఎప్పుడూ నిలబడను. భారత్‌పై నాకున్న ప్రేమ మిమ్మల్ని బాధపెడితే.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వినిపించే నా మాటలు మీరు వినలేకపోతే.. నన్ను అన్‌ఫాలో చేయండి. నేను శాంతి కోసం మాట్లాడతాను. సత్యం కోసం నిలబడతాను. ఎప్పుడూ నా సైనికుల వెంటే ఉంటాను. ఎందుకంటే నా సైనికులు పేరు, మతం అడగకుండానే రక్షిస్తారు. మీ అందరి ట్రోల్స్, బెదిరింపులు నేను గమనిస్తూనే ఉన్నాను. నేను ఇలాంటి వారిని క్షమించను. జైహింద్’’ అని రాసుకొచ్చారు. ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించినప్పుడు సెలీనా పోస్ట్ పెట్టారు. తాను ఆరేస్టలియాలో ఉన్నప్పటికీ తన మనసంతా భారత్ గురించే ఆలోచిస్తుందని రాశారు.