Aarti Ravi: నాన్న.. అంటే టైటిల్‌ కాదు.. అదొక బాధ్యత

ABN , Publish Date - May 10 , 2025 | 10:36 AM

తాజాగా జయం రవి మరోసారి వార్తలో నిలిచారు. సింగర్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన ఆయన తాజాగా ఆమెతో కలిసి ఓ వేడుకలో కనిపించారు. ప్రస్తుతం ఆ ఫొటోలు, సంబంధిత వార్తలు నెట్టింట వైరల్‌ కావడంతో మరోసారి ఈ జంట ట్రెండింగ్‌లోకి వచ్చారు.


నటుడు జయం రవి (Jatyam Ravi) సింగర్‌ కెనీషాతో (Kenisha)రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, అందుకే భార్య ఆర్తికి విడాకులు ఇచ్చారంటూ కొన్ని నెలల క్రితం కోలీవుడ్‌ మీడియాలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా జయం రవి మరోసారి వార్తలో నిలిచారు. సింగర్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన ఆయన తాజాగా ఆమెతో కలిసి ఓ వేడుకలో కనిపించారు. ప్రస్తుతం ఆ ఫొటోలు, సంబంధిత వార్తలు నెట్టింట వైరల్‌ కావడంతో మరోసారి ఈ జంట ట్రెండింగ్‌లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి ఆర్తి రవి (Aarti Ravi) సోషల్‌ మీడియాతో ఓ పోస్ట్‌ పెట్టారు.

‘‘గత ఏడాదిగా నేను ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నా.  ఎందుకంటే నా కంటే నా పిల్లల ప్రశాంతతే నాకు ముఖ్యం అనుకున్నా. నాపై వచ్చిన ఆరోపణలు అన్ని భరించా. అంతమాత్రాన నా వైపు నిజం లేదని కాదు. ఈ రోజు ప్రపంచమంతా ఫొటోలను చూసింది. మా విడాకుల ప్రాసెస్‌ ఇంకా కొనసాగుతోంది. కానీ, 18 ఏళ్లపాటు నాకు తోడుగా ఉన్న వ్యక్తి అలా చేశారు. కొన్ని నెలలుగా వారి పిల్లల బాధ్యత నాపైనే ఉంది. ఆయన్నుంచి ఆర్థికంగానే కాదు నైతికంగానూ సపోర్ట్‌ లేదు. వాటికి తోడు ఇప్పుడు ఇంటి విషయంలో బ్యాంకు నుంచి సమస్య ఎదురైంది. అప్పుడు నేను లెక్కల కంటే ప్రేమకే విలువిచ్చా. ప్రేమ విషయంలో నేను బాధపడటం లేదు. నా పిల్లలకు భద్రత అవసరం. సైలెన్స్‌ కాదు. చట్టపరమైన అంశాలు నా పిల్లలకు తెలియకపోవచ్చు. మీటింగ్స్‌ క్యాన్సిల్‌ చేయడం, మెేసజ్‌కు రిప్లై ఇవ్వకపోవడం, ఫోన్‌ కాల్‌ లిఫ్ట్‌ చేయకపోవడం,, గాయాల్లాంటివి ఇలా ఏం జరుగుతుందో వారు అర్థం  చేసుకోగలరు. నేను ఈరోజు ఓ భార్యగా, అన్యాయానికి గురైన మహిళగా కాదు పిల్లల శ్రేయస్సే లక్ష్యంగా ఉన్న తల్లిగా మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను మాట్లాడకపోతే.. వారికి భవిష్యత్తు ఉండదు. మీరు నిజాన్ని మార్చలేరు. తండ్రి అంటే టైటిల్‌ మాత్రమే కాదు అదో బాధ్యత. విడాకుల విషయంలో తుది తీర్పు వెలువడే వరకూ నా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ఆర్తి రవిగానే ఉంటుంది. నేను ఏడవడం లేదు. అరవడం లేదు. ఇప్పటికీ నాన్నా అని నిన్ను పిలుస్తున్న పిల్లల కోసం నిలబడ్డా’’ అని పేర్కొన్నారు.

ALSO READ: Vijay Deverakonda, Rashmika: హ్య‌పీ బ‌ర్త్ డే ‘విజ్జు’.. మ‌రోసారి దొరికిపోయిన ర‌ష్మిక

Pawan Kalyan: 96 ఏళ్ల అభిమానికి.. స్వ‌యంగా అన్నం వ‌డ్డించి క‌లిసి భోజ‌నం చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌

Updated Date - May 10 , 2025 | 10:59 AM