Durandhar: 'దురంధర్' రికార్డ్స్ ర్యాంపేజ్.. ‘పుష్ప 2’ రికార్డులు బద్దలు
ABN, Publish Date - Dec 20 , 2025 | 06:31 PM
'దురంధర్' రికార్డ్స్ ర్యాంపేజ్ కొనసాగుతోంది. ఇయర్ ఎండింగ్ లో బాలీవుడ్ కు కొత్త ఊపిరిపోస్తోందీ సినిమా. పైగా కొత్త రికార్డ్స్ కి కేరాఫ్ గా మారుతోంది.
బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన 'దురంధర్' సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. ఊహించని వసూళ్లు సాధిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమా దెబ్బకు పాత రికార్డులన్ని కొట్టుకుపోతున్నాయి. ఈ మూవీ రికార్డులను చూసి ట్రేడ్ అనలిస్టులు షాక్ అవుతున్నారు.
డిసెంబర్ 5న విడుదలైన 'దురంధర్' మూవీ మొదటి వారంలో దాదాపు రూ. 207 కోట్ల గ్రాస్ వసూళ్లు సంపాదించింది. ఇక రెండవ వారంలో ఇంకా ఎక్కువ ఊపు చూపించి... దాదాపు రూ. 253 కోట్లు వసూలు చేసింది. ఇది మొదటి వారం కంటే ఎక్కువే. అంతేకాకుండా హిందీ సినిమాల చరిత్రలో రెండవ వారానికి ఆల్-టైమ్ రికార్డుగా నిలిచింది. ఈ రికార్డుతో 'దురంధర్' గతంలో 'పుష్ప 2' హిందీ వెర్షన్ రెండవ వారం సాధించిన దాదాపు రూ. 200 కోట్లుని భారీ మార్జిన్‌తో అధిగమించింది. డిసెంబర్ 20 నాటికి ఈ సినిమా ఇండియాలో రూ. 483 కోట్ల నెట్, ప్రపంచవ్యాప్తంగా రూ. 730 కోట్లకు పైగా గ్రాస్ అందుకుంది. చూస్తుంటే రూ.500 కోట్ల నెట్ క్లబ్‌లోకి ప్రవేశించడం ఖాయంగా కనిపిస్తోంది.
'దురంధర్' సినిమాకు పోటీగా డిసెంబర్ 19న విడుదలైన 'అవతార్: ఫైర్ అండ్ యాష్' పోటీ ఉన్నప్పటికీ, 'దురంధర్' దూకుడు చూపిస్తోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవులు ముందున్న నేపథ్యంలో సినిమా రూ. 600 నుండి 700 కోట్ల నెట్‌కు చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఇది 2025లో టాప్ గ్రాసర్లలో ఒకటిగా నిలిచి, 'కాంతార: చాప్టర్ 1' ను అధిగమించబోతోంది. హిందీ వెర్షన్‌లోనే ఈ సినిమా ఈ స్థాయి విజయం సాధించడం మరో విశేషం. ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.
Read Also: Rajamouli: సినిమాలకు రాజమౌళి గుడ్ బై..
Read Also: NTR: వార్ 2 డిజాస్టర్.. హిందీ సినిమాలంటే భయపడుతున్న ఎన్టీఆర్