PK2: 'పీకే సీక్వెల్' పై హింట్
ABN, Publish Date - Jun 04 , 2025 | 07:01 PM
బాలీవుడ్ లో క్రేజీ మూవీకి సీక్వెల్ రెడీ అవుతోంది. స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్‌ఖాన్ (Aamir Khan) నటించిన 'పీకే' (pk) సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో అందరికీ తెలుసు. 2014లో వచ్చిన ఈ మూవీ సినీ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఏలియన్ రోల్ లో తన అద్భుత నటనతో మైస్మరైజ్ చేశాడు మిస్టర్ పర్ఫెక్ట్ . అయితే ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని అప్పట్లో అందరూ భావించారు. కట్ చేస్తే... ఇన్నాళ్లకు ఈ మూవీ సీక్వెల్ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
పీకే లో ఓవైపు కామెడీని పండిస్తూనే మరోవైపు మత విశ్వాసాలు లాంటి సీరియస్ అంశాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ (Rajkumar Hirani) . ఈ మూవీ క్లైమాక్స్‌లో తన గ్రహానికి తిరిగి వెళ్లిపోయిన ఆమిర్ (Aamir) .. రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor)తో కలసి మళ్లీ భూమి మీదకు వస్తాడు. అంతటితో సినిమా ముగుస్తుంది. అలాంటి మూవీకి చాలా ఏళ్ల తర్వాత కొనసాగింపు వస్తుందని తెలిసి మూవీ లవర్స్ ఖుషి అవుతున్నారు. అయితే రీసెంట్ గా ఈ సినిమా సీక్వెల్ పనులు సైలెంట్ గా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్ట్ 2 పై హిరానీ కూడా హింట్ ఇవ్వడం వైరల్ గా మారింది.
ప్రెజెంట్ హిరానీ ఫాల్కే బయోపిక్ (Phalke Bio Pic)పై ఫోకస్ పెట్టారు. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాతే పీకే రెండో భాగాన్ని సీరియస్ గా తీసుకోనున్నారట. అయితే పార్ట్ 2లో ఆమిర్ తో పాటు రాకింగ్ స్టార్ రణబీర్ కపూర్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పార్ట్ 1 ఎక్కడ నుంచి ముగిసిందో... అక్కడి నుంచి పార్ట్ 2 మొదలు కానున్నట్లు తెలుస్తోంది. రణబీర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. లవ్ అండ్ వార్ (Love & War), రామాయణం(Ramayanam), యానిమల్ పార్క్ (Animal Park) సినిమాలలో నటిస్తున్నాడు. ఈ చిత్రాలు కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫ్రాంచైజీ లో నటించనున్నట్లు తెలుస్తోంది. ఆమిర్ ఖాన్ నటించిన 'సితారే జమీన్ పర్' విడుదలకు సిద్ధమవుతోంది. ఇటు హిరానీ సైతం ఫాల్కే బయోపిక్ తర్వాత పీకే 2 స్క్రిప్ట్ పైనే ఫోకస్ పెట్టనున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. పార్ట్ వన్ తో వండర్స్ క్రియేట్ చేసిన హిరానీ సీక్వెల్ తో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తాడో చూడాలి.