సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ramayana:‘రామాయణ’ ప్రపంచానికే ప్రామాణికంగా ఉంటుంది

ABN, Publish Date - Nov 27 , 2025 | 04:22 PM

‘రామాయణ’ మొత్తం ప్రపంచానికే ఓ ప్రామాణికంగా ఉంటుందని ఈ చిత్ర దర్శకుడు నితీశ్‌ తివారీ అన్నారు.

Ramayana

దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ‘రామాయణ’ (Ramayana)చిత్రం రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటున్న విషయం విధితమే. రణబీర్‌ కపూర్ (Ranbir Kapoor) శ్రీరాముడిగా, సాయిపల్లవి (Sai Pallavi) సీతగా నటిస్తున్నారు. ఇందులో రావణుడి పాత్ర పోషిస్తూ, చిత్ర నిర్మాణంలో కూడా భాగస్వామి అయ్యారు కన్నడ హీరో యశ్ (Yash). వచ్చే ఏడాది డిసెంబర్‌లో ‘రామాయణ’ చిత్రం విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు నితీశ్‌ తివారీ (Nitesh Tiwari) ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు. ఓ దృశ్య కావ్యంలా, విజువల్‌ వండర్‌గా ‘రామాయణ’ను రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘కొన్ని కథలు ఎన్ని సార్లు విన్నా కొత్తగానే ఉంటాయి. అలాగే రామాయణం కూడా. ఈ సినిమాలో విఎ్‌ఫఎక్స్‌ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం. విజువల్స్‌ చాలా బాగుంటాయి. అతిశయోక్తి కాదు కానీ ‘రామాయణ’ మొత్తం ప్రపంచానికే ఓ ప్రామాణికంగా ఉంటుంది.

ఓ తపస్సులా, యజ్ఞంలా ఐదేళ్ల నుంచి ఈ సినిమా కోసం పని చేస్తున్నాం. ప్రపంచంలోనే గొప్ప వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియోల్లో ఒకటైన ప్రైమ్‌ ఫోక్‌సతో కలసి పని చేయడం ఆనందంగా ఉంది. ఇంత అద్భుతమైన చిత్రానికి నేను దర్శకత్వం వహిస్తున్నానని గర్వంగా చెప్పడానికి నాకు రెండేళ్లు పట్టింది. చిత్రం మీద పూర్తి నమ్మకంతో ఉన్నానిప్పుడు.. వచ్చే ఏడాది దాదాపు ఇదే సమయానికి విడుదలయ్యే ‘రామాయణ’ చిత్రం తొలి భాగానికి ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందా అని కొంత టెన్షన్‌గా ఉంది’ అన్నారు నితీశ్‌ తివారీ.

Updated Date - Nov 27 , 2025 | 04:26 PM