Sivakarthikeyan: నా దైవం నుంచి అభినందనలు.. ఇంకేం కావాలి..

ABN , Publish Date - Sep 11 , 2025 | 02:54 PM

తమిళ హీరో శివకార్తికేయన్‌పై తలైవా రజనీకాంత్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో శివకార్తికేయన్‌ నటించిన ‘మదరాసి’ గత వారం ప్రేక్షకుల ముందుకొచ్చింది


తమిళ హీరో శివకార్తికేయన్‌పై (Sivakarthikeyan) తలైవా రజనీకాంత్‌ (Rajanikanth) ప్రశంసల వర్షం కురిపించారు. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో శివకార్తికేయన్‌ నటించిన ‘మదరాసి’ (Madarasi0 గత వారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా ఈ సినిమాను వీక్షించిన రజనీ చిత్రబృందాన్ని అభినందించారు. ఈ విషయాన్ని శివకార్తికేయన్‌ సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ పెట్టారు. దైవంగా భావించే  రజనీ సర్‌ నుంచి ప్రశంసలు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ట్వీట్‌లో పేర్కొన్నారు.



‘మదరాసి సినిమా నాకు బాగా నచ్చింది. నీ నటన మరో స్థాయిలో ఉంది. నువ్వు యాక్షన్‌ హీరో అయిపోతావు. నా దీవెనలు నీకు ఎప్పుడూ ఉంటాయి’ అంటూ తన చిరునవ్వుతో రజనీకాంత్‌ నన్ను ప్రశంసించారు. నా దైవం నుంచి అభినందనలు  అందుకోవడం ఆనందంగా ఉంది’ అని శివకార్తికేయన్‌ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఇక ఈ సినిమా విడుదలైన అనంతరం కోలీవుడ్‌ సినీ ప్రముఖులు దీన్ని ప్రశంసిస్తూ ఎక్స్‌ వేదికగా చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. దర్శకుడు శంకర్‌, లింగుస్వామి ‘మదరాసి’పై చక్కని రివ్యూలు ఇచ్చారు.

READ ALSO: Tollywood Producer: పిటిషన్‌ వెనక్కి తీసుకోకుంటే చంపేస్తా.. నిర్మాత బెదిరింపులు

Folk Song: జాజిరిలాట‌లాడంగా.. మ‌రో మంచి ప‌ల్లె పాట వ‌చ్చింది

Kishkindhapuri: కిష్కింద‌పురి.. ప్రీమియ‌ర్ టాక్ రివ్యూ! బెల్లంకొండ హిట్ కొట్టాడా

Updated Date - Sep 11 , 2025 | 02:54 PM